తమిళ స్టార్ హీరో అజిత్(Ajith) నుంచి వస్తున్న మూవీ విదాముయార్చి(Vidaamuyarchi). ఈ మూవీ తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ కాబోతోంది. గ్లామర్ క్వీన్ త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలవల్ల విడుదల కాలేదు. ఈనెల 6న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ గ్రాండ్ గా ఉన్నాయి. అజిత్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టారు. ట్రైలర్ తో ఈ మూవీపై సూపర్ బజ్ ఏర్పడింది.
కానీ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సందడి మాత్రం లేదు. ఒక మూవీ రిలీజ్ కి ముందు ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కలిసి మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లు ఇస్తారు. అందులో హైలెట్స్ ని చెబుతూ ప్రేక్షకులు ఆ మూవీ ఎందుకు చూడాలో, అందులో ఏముందో చెప్పి వారిలో మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తారు. ప్రేక్షకులు కూడా మూవీపై అంచనాలు పెట్టుకుని థియేటర్లకు వస్తారు.
పట్టుదల (Pattudala) మూవీ మేకర్స్లో మాత్రం ఏ హడావిడి లేదు. ఎలాంటి ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ చేస్తున్నట్టుగా అగుపించడం లేదు. అజిత్ మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన మూవీని ఎప్పుడు రిలీజ్ చేసినా సూపర్ గా ఆడుతుంది.ఆడియన్స్ ఆదరిస్తారననే నమ్మకంతో మేకర్స్ ఉంటారు.
Vidaamuyarchi movie ప్రమోషన్స్ తీరుపై..
అయితే కొందరు సినీ అభిమానులు మాత్రం మూవీ (Vidaamuyarchi movie) విడుదలకు మూడు రోజులే ఉంది. మేకర్స్ సరైన ప్రమోషన్స్ చేయకపోతే ఈ మూవీని ఆడియన్స్ పట్టించుకోవడం మానేస్తారంటున్నారు. మూవీని జనాల్లోకి తీసుకెళ్లే పట్టుదలతో మేకర్స్ లేరని మూవీ లవర్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. హీరో అజిత్ కూడా ఈ మూవీపై ఎక్కడ మాట్లాడినట్టు లేదు. మూవీ ప్రమోషన్స్ కి ఇంటర్వ్యూలకి చాలా కాలంగా ఆయన దూరంగానే ఉంటున్నారు.
ఇదిలా ఉండగా మాగీజ్ తిరుమేని (magiz thirumeni) డైరెక్షన్లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రెజీనా,అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ మూవీకి తమిళ మ్యూజిక్ రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








