Kingdom Movie Release | కొందరు హీరోలకు హిట్టు ప్లాప్ లతో సంబంధం ఉండదు. మూవీస్ తీసుకుంటూ వెళ్తారు.అవి హిట్టయిన ఫ్లాఫ్ అయినా వారి రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు.అలాంటి హీరోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన లాస్ట్ హిట్టు ఏంటనేది కూడా ఫాన్స్ మరిచిపోయే ఉంటారు.అలాంటి హీరో నుండి మూవీ వస్తుందంటే పెద్దగా బజ్ ఉండదు.
కానీ విజయ్ లెటెస్ట్ మూవీ కింగ్ డమ్ (Kingdom)పై ఆ ఎఫెక్ట్ ఉన్నట్టు కనబడట్లేదు. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండే ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. గౌతమ్ తిన్ననూరి(Goutham thinnanuri)డైరెక్టర్ కావడంతో ఈసారి పక్కా హిట్టు కొట్టడం ఖాయం అని ధీమాతో ఉన్నారు. మళ్ళీరావా, జెర్సీ (Malli Rava, Jersi)మూవీలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కావడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది.
విజయ్ లుక్, మ్యూజిక్ తో హైప్…
ఇక రౌడీ స్టార్ క్రేజ్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పెరిగిపోతుంది.తన నుండి ఫ్యామిలీ స్టార్, లైగర్, ఖుషీ(family Star, ligar, khushi) లాంటి భారీ మూవీస్ అట్టర్ ఫ్లాప్ అయినా విజయ్ స్టార్ డం మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. కింగ్ డమ్ మూవీలో విజయ్ లుక్, మ్యూజిక్ బాగుండడంతో మూవీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని టాక్ వినబడుతోంది.
Kingdom : జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్….
రేపు రిలీజ్ అవుతున్న ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తె మాత్రం రికార్డులు క్రియేట్ అవడం పక్కా అని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో అయ్యాయని చెప్పుకుంటున్నారు. కొన్ని థియేటర్ల లో టికెట్లు అన్ని సోల్డ్ ఔట్ అయినట్టు తెలుస్తోంది. దాదాపు 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతటి పాజిటివ్ వైబ్ తో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరియర్ ను మళ్లీ గాడిలో పెడుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య (sithara entertainments farchune four banner) ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ మూవీలో హీరో సత్య(sathya) ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా భాగ్య శ్రీ బోర్సె(Bhagya sri bhorse)హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది.తమిళ్ మ్యూజిక్ సంచలనం అనిరుద్ (Anirudh)మ్యూజిక్ అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.