రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్న నూరి (Goutham thinnanoori) డైరెక్షన్లో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగదేవర సూర్యవంశి,సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ కింగ్ డమ్ (Kingdom) అనే టైటిల్ ఖరారు చేస్తూ టీజర్ ను కూడా రిలీజ్ చేసింది. తెలుగు,హిందీ తమిళ్ లో ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ్ లో సూర్య(Surya), హిందీలో రణబీర్ కపూర్ (Ranbeer kapoor) వాయిస్ ఓవర్ ఇచ్చారు.
తెలుగులో ఎన్టీఆర్ (NTR) వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే గుర్తుండి పోయేలా మూవీ నిలుస్తుంది అనిపిస్తుంది. ఇటీవల తను చేసిన మూవీస్ వరుసగా ప్లాప్ అయ్యాయి. దానికి చెక్ పెట్టేలా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టు గ్యారెంటీ అనేలా టీజర్ కట్ చేశారు. విజయ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు డిఫరెంట్ గా ఉండేలా చూసుకున్నాడు. ఈ మూవీలో కూడా డిఫరెంట్ గా తన క్యారెక్టర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.తన లుక్, స్క్రీన్ ప్రజెన్స్ కొత్తగా అనిపిస్తోంది. టీజర్ మొత్తం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీస్ ఫ్లేవర్ కనిపిస్తుంది. అలా ఓ కథను గౌతమ్ తిన్ననూరి స్టైల్ లో చెప్పబోతున్నట్టు అనిపిస్తోంది.

Vijay Devarakonda : మాస్ యాక్షన్ తో ఆకట్టుకున్న కింగ్ డమ్
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో మొదట అలసట లేని భీకర యుద్ధం అని అన్నప్పుడు మిలటరీ డ్రెస్సులో ఉండే వ్యక్తుల కాల్పులు చూపెట్టాడు. చూస్తే ఒక ప్రాంతంలో ప్రజలకు, వేరే వర్గానికి మధ్య జరిగిన యుద్ధమే ఈ మూవీ అనిపిస్తుంది.ఇటు కాల్పులతో వీరు, అటు బాణాలతో ప్రజలు వారిని ఎదురించడం చూస్తే ఓ సరికొత్త పాయింట్ ని చూపెట్టనున్నట్టు అర్థమవుతుంది. అలలుగా పారే ఏరుల రక్తం…
వలసపోయిన.. అలసిపోయిన ఆగిపోనిది మహారణం.. నేలపైన దండయాత్రలు.. మట్టి కింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరికోసం.. ఇంత బీభత్సం ఎవరికోసం.. అసలు ఈ వినాశనం ఎవరికోసం.. రణ భూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం.. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మాన్ని ఎత్తిన నాయకుడి కోసం… అంటూ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. కష్టాల్లో ఉన్న ఆ ప్రజల తరపున విజయ్ దేవరకొండ పోరాడే కేరక్టర్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. జైలులో ఖైదీని చేయగా,అతడి చుట్టూ ఖైదీలందరూ ఉండగా తన అరిచిన అరుపు తో సినిమా ఎంత ఎమోషనల్ గా ఉంటుందో తెలియజేసింది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే డిఫరెంట్ గా మూవీని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈసారి తన అభిమానులకు (Vijay Devarakonda Fans) గట్టిగానే హిట్టు ఇస్తున్నానని టీజర్ తో హింట్ ఇచ్చాడు.
గౌతం తిన్ననూరి పవర్ ఫుల్ డైలాగ్స్, సూపర్ విజువల్స్, ఎక్కడ తగ్గని నిర్మాణ విలువలు ఆడియన్స్ కి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసుకునేల చేశాయి. ఈ మూవీకి అనిరుద్ (Anirudh) మ్యూజిక్ పెద్ద అస్సెట్ గా నిలుస్తుంది అన్పిస్తుంది. ఇటీవల అజిత్ పట్టుదల మూవీ లో తనిచ్చిన మ్యూజిక్ తేలిపోయింది. కానీ ఈ మూవీకి అదిరిపోయేలా బీజీ ఎం ఇచ్చాడని టీజర్ లోనే అర్థమైపోయింది. సినిమాలోని సీన్స్ ని ఎలివేట్ చేసేలా బీజి ఎం ఉంటుందని తెలుస్తోంది. అంతకుముందు గౌతమ్ తిన్ననూరి,అనిరుద్ కాంబో జెర్సీ మూవీ ఎంత బిగ్గెస్ట్ హిట్టో తెలుసు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీకి కూడా అనిరుద్ ని తీసుకోవడం మూవీకి ప్లస్ గా మారుతుందనుకోవచ్చు.
ఇదిలా ఉండగా ఈ మూవీని మే 30 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఫుల్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ మూవీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వరుస డిజాస్టర్లకు బ్రేక్ వేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయని విధంగా టీజర్ ఉందనడంలొ సందేహం లేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








