Sarkar Live

Vijay Sethupathi | పూరీ – విజయ్ సేతుపతి కాంబో సెట్ ..

Vijay Sethupathi New Movie | కొన్ని రోజులుగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh)నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడో అని జోరుగా చర్చ నడుస్తుంది. ఒకసారి హీరో గోపీచంద్ తో మూవీ తీయబోతున్నాడని, మరోసారి ఇంకో హీరోకు కథ వినిపించాడని

Vijay Sethupathi

Vijay Sethupathi New Movie | కొన్ని రోజులుగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh)నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడో అని జోరుగా చర్చ నడుస్తుంది. ఒకసారి హీరో గోపీచంద్ తో మూవీ తీయబోతున్నాడని, మరోసారి ఇంకో హీరోకు కథ వినిపించాడని ఇక పట్టాలెక్కడమే తరువాయని ఇలా రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఉగాది పండుగ రోజున తన నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేయబోతున్నాడో చెప్పేశారు.

పూరి జగన్నాథ్ తన తర్వాత సినిమాని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో (makkal selvan Vijay Sethupathi) తీయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా తనే కూడా నిర్మించనున్నారు. అలాగే చార్మి.. పూరి జగన్నాథ్ తో గత కొన్ని సినిమాలుగా సహ నిర్మాతగా ఉంటుంది. డబుల్ఇస్మార్ట్ భారీ ఫ్లాప్ తర్వాత పూరి నెక్స్ట్ చేయబోయే మూవీకి చార్మిని (Charmi) దూరం పెట్టారని కొన్ని రోజులుగా రూమర్స్ వినపడుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజుతో అది రూమర్ అనే తేలిపోయింది.

Vijay Sethupathi : డిఫరెంట్ స్టోరీనా..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో తీయబోతున్న మూవీకి కూడా ఛార్మి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. అయితే విజయ్ సేతుపతి మహారాజా మూవీతో తన స్టార్డం విదేశాలకు కూడా పాకింది. అలాంటి హీరో ఫ్లాప్ లో ఉన్న పూరికి అవకాశం ఇచ్చారంటే ఆ స్టోరీ ఎంత బలమైనదో అర్థమవుతుంది. విజయ్ సేతుపతి మామూలుగా ఒక కథను అంత ఈజీగా ఓకే చేయడు. డిఫరెంట్ గా ఉంటేనే ఆ మూవీని చేస్తాడు.

జూన్ లేదా జులైలో ప్రారంభం…

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటారు.కథ నచ్చి విలన్ పాత్రలతో కూడా అదరగొట్టిన సేతుపతి ఒక దశలో వరుసగా విలన్ ఆఫర్లె వస్తుండడంతో ఇక చేయనని చెప్పేశాడు. తను ఎంచుకున్న కథలు కూడా డిఫరెంట్ గా ఉంటేనే ఓకే చేస్తాడు కాబట్టి పూరి చెప్పిన స్టోరీ సేతుపతికి తెగ నచ్చేసి ఉంటుంది. ఈసారి పూరి కూడా తను రెగ్యులర్ గా తీసే ఫార్మాట్లో కాకుండా డిఫరెంట్ జానర్ కథను ఎంచుకున్నట్లు, అటువంటి కథతోనే సేతుపతిని ఒప్పించినట్లు అర్థమవుతుంది. ఈ క్రేజీ కాంబో జూన్ లేదా జులైలో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతోనైనా పూరి తన మునుపటి ఫామ్ ను అందుకోవాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏమైనా ఈ క్రేజీ కాంబోపై అటు పూరి అభిమానులు ఇటు సేతుపతి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?