Kollywood : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) ఏ క్యారెక్టర్ చేసినా అందులో ఇన్వాల్ అయిపోతారు. ఒక సినిమాలో తండ్రి పాత్రలో మెప్పించగలడు.. అలాగే విలన్ పాత్రలో అలరించగలడు.. అలాగే హీరోగా లుక్ మార్చుకొని ఇరగోట్టగలడు. ఎటువంటి పాత్రనైనా చేసి ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. ఆయన తాజా చిత్రం ఏస్ (Ace) గ్లింప్స్ ను తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
అరుముగా కుమార్ ( Arumuga kumar) డైరెక్షన్లో సెవెన్ సీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు మాస్ ఎలివేషన్స్ తో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ ఉండబోతుందని గ్లింమ్స్ చూస్తే అర్థమవుతుంది. రుక్మిణి వసంత్, యోగిబాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మహారాజ తర్వాత వస్తున్న మూవీ కావడంతో విజయ్ సేతుపతి ఖాతాలో మరో హిట్టు చేరుతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. గ్లింప్స్ లో ఆయన స్టైలిష్ లుక్ లో లుంగీ కట్టుకొని బ్యాగ్ వేసుకొని ఎయిర్పోర్ట్లో వెళ్తుండడం మూవీపై అంచనాలను పెంచేస్తోంది.
తెలుగు, తమిళం, హిందీలో తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పరచుకున్నారు. లేటె స్ట్ గా మహారాజా (Maharaja) మూవీని చైనాలో విడుదల చేసి 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు.ఈ మూవీతో చైనాలో కూడా మంచి మార్కెట్ ని సంపాదించుకున్నారు. తర్వాత వచ్చే ఏస్ అనే మూవీ కూడా అక్కడ విడుదల అవుతుందేమో చూడాలి. చాలా తక్కువ మంది హీరోల సినిమాలు మాత్రమే చైనాలో విడుదలై విజయాలు సాధిస్తుంటాయి. ఆ ఖాతాలో విజయ్ సేతుపతి చేరిపోయారు. ఒక సౌత్ సినిమా చైనాలో 100 కోట్ల కలెక్షన్లు రాబట్టడమంటే మామూలు విషయం కాదు. విజయ్ సేతుపతి నటనకు ముగ్ధులైన అక్కడి ఆడియన్స్ ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు.
Vijay Sethupathi ఏస్ మూవీ..
ఏస్ మూవీ(Ace Movie)లో బోల్డ్ కన్నన్ గా అలరించబోతున్న విజయ్ సేతుపతి స్టైలిష్ లుక్ చూసే ఆడియన్స్ అదిరిపోయిందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీకి జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా కరణ్ భగత్ రావత్, ఎడిటింగ్ ఫన్నీ ఓలీవర్,చేస్తున్నారు. ఏస్ మూవీ థియేటర్లలో ఎప్పుడు విడుదల అవుతుందో ఇంకా మూవీ టీమ్ ఖరారు చేయలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..