Sarkar Live

​సొంత ప్రభుత్వంపై విజయశాంతి అసహనం: “ఉద్యమకారులకు ఇచ్చిన హామీల సంగతేంది?”

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలు అమలు కాకపోవడాన్ని ఆమె శాసన మండలి వేదికగా నిలదీశారు.

​అమలుకు నోచుకోని ప్రధాన హామీలు

​ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ విజయశాంతి పలు అంశాలను ప్రస్తావించారు.ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇళ్ల స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం,నెలకు రూ. 4,000 పెన్షన్ పంపిణీ,​ఆరోగ్యం & ఉపాధి: రూ. 10 లక్షల ఆరోగ్య బీమాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం తదితర హామీలను ప్రస్తావించారు.​”ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది, అది శుభపరిణామమే. కానీ, రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత (First Priority) ఇవ్వకపోవడం బాధాకరం,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కమిటీల పేరుతో కాలయాపన వద్దు!

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామన్న ప్రతిపాదనపై విజయశాంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండేళ్ల కాలయాపన జరిగిందని, ఇప్పుడు మళ్లీ కమిటీల పేరుతో ప్రక్రియను మరింత ఆలస్యం చేయవద్దని ఆమె కోరారు.

క్షేత్రస్థాయిలో తప్పని నిలదీతలు
“క్షేత్రస్థాయిలో ఉద్యమకారులు మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇచ్చిన మాట ఏమైందని వారు మర్యాదపూర్వకంగానే అడుగుతున్నా, వారికి సమాధానం చెప్పలేక మేము ఇబ్బంది పడుతున్నాం,” అని విజయశాంతి పేర్కొన్నారు. తెలంగాణ సమాజం గౌరవించే ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి, త్వరితగతిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.సొంత పార్టీ ఎమ్మెల్సీయే ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?