Vikarabad Tragic Incident | వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య, వదిన, కూతురిని హత్య చేసి, తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య అలివేలు (32), కుమార్తెలు అపర్ణ (13), శ్రావణి (10), వదిన హనుమమ్మ (40)ల పై కత్తితో కిరాతకంగా దాడి చేసి బలిగొన్నాడు. ఆపై అతడూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ దాడితో గాయాలపాలై ప్రాణాలతో బయటపడిన యాదయ్య పెద్ద కూతురు అపర్ణ తరుకొని ఇరుగుపొరుగువారికి చెప్పింది. స్థానికులు వచ్చి చూసేసరికి భార్య, వదిన, చిన్న కుమార్తెతో పాటు యాదయ్య మృతదేహాలు కనిపించాయి. స్థానికులు కులకచర్ల పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న గాయాలతో విలవిలలాడుతున్న అపర్ణను ఆస్పత్రికి తరలించారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








