Vikarabad bribery case | వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రూ.15,000 లంచం (Bribery ) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ తనిఖీల అనంతరం ఉమ్మడి రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాతో వివరాలు వెల్లడించారు. నవాబ్ పేట మండలం, వట్టిమినపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు రెండెకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. ఆ భూమిని పట్టా భూమి అంటూ ఓ రియాల్టర్ కబ్జా చేసేందుకు యత్నించాడు. దీంతో బాధితుడు నవాబుపేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డర్ కాపీ తీసుకురావాలని తహసీల్దార్ తెలిపారు. దీంతో ఆర్డర్ కాపీ కోసం కలెక్టర్ కార్యాలయంలో బాధితుడు దరఖాస్తు సమర్పించాడు. కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ శాఖ పరిధిలోని ఈ సెక్షన్ లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సుజాత ఆ ఫైల్ కలెక్టర్ టేబుల్ మీదకి వెళ్లాలంటే తనకు రూ.5,000 లంచం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసింది. చేసేదిలేక సదరు రైతు రూ.5,000 ఆన్లైన్లో పేమెంట్ చేశాడు.
కలెక్టర్ నుంచి వొచ్చిన ఆర్డర్ కాపీ మళ్లీ తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి పంపాలంటే మరో రూ.20,000 (Bribery )డిమాండ్ చేసింది. అయితే తాను రూ.20వేలు ఇచ్చుకోలేనని రూ.15,000 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు యాక్షన్ లోకి దిగారు. మంగళవారం జూనియర్ అసిస్టెంట్ సుజాతకు రూ.15,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసును దర్యాప్తుచేసి నిందితులందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








