Hyderabad News : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టుల (Telangana Railway Projects) పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వికారాబాద్–కృష్ణా కొత్త రైల్వే లైన్ (Vikarabad Krishna Railway line) పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. తెలంగాణలోని ఇండస్ట్రియల్ సెక్టార్ అభివృద్ధి కోసం ప్రత్యేక రైల్వే లైన్ అవసరమని సీఎం రేవంత్ సూచించారు. ఇందు కోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్ రవాణా అవసరాలకు కీలకమని ఆయన వివరించారు. అలాగే శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌తో పోలిస్తే కొత్త లైన్ ద్వారా ప్రయాణ దూరం తగ్గుతుందని సీఎం పేర్కొన్నారు.
భవిష్యత్ ప్రాజెక్టులు
- రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్ర రవాణా అవసరాలకు కీలకం అవుతుందని సీఎం తెలిపారు.
- శంషాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.
- కొత్త లైన్ ద్వారా ప్రయాణ దూరం తగ్గి, రవాణా వేగవంతమవుతుందని సీఎం పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








