Vikatan website : తమిళనాడు (Tamil Nadu)లో అత్యంత ప్రాచుర్యమున్న మీడియా సంస్థ వికటన్ (Vikatan) . ఇదిప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పై రూపొందించిన ఒక కార్టూన్ కారణంగా ఆ వెబ్‌సైట్ బ్లాక్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ చర్యలను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
Vikatan website blocked ఎలా అయ్యింది?
వికటన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం… వికటన్ అధికారిక వెబ్‌సైట్ (website) ఆకస్మాత్తుగా నిన్న రాత్రి నుంచి అందుబాటులో లేకుండా పోయింది. ఇది తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసలు ఈ వెబ్‌సైట్ ఎందుకు బ్లాక్ అయ్యిందో తెలియరాలేదు. బ్లాక్ చేసిందెవరో, ఎవరు చేయించారో స్పష్టత లేదు. ప్రధాని మోదీపై వ్యంగ్యంగా ఈ వెబ్‌సైట్ ఓ కార్టూన్‌ను ప్రచురించడమే దీనికి కారణమని తెలుస్తోంది.
Vikatan website వివాదాస్పద కార్టూన్ ఏమిటి?
అమెరికాలో అక్రమంగా ఉన్న భారతీయ వలసదారుల (illegal immigrants) ను తిరిగి పంపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని చెప్పేందుకు వికటన్ వెబ్‌సైట్ ఓ కార్టూన్‌ను ప్రచురించింది. మోదీ చేతులు గొలుసులతో బంధించి ఉన్నట్టు చిత్రీకరించింది. ఇది బీజేపీ నాయకుల ఆగ్రహానికి కారణమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump)తో ప్రధాని మోదీ సమావేశమైనప్పుడు భారతీయ వలసదారులను బేడీలు వేసి తిరిగి పంపడంపై ఆయన మౌనం పాటించారని చెప్పేందుకు వికటన్ వెబ్‌సైట్ వ్యంగ్యంగా కార్టూన్ వేసింది.
భగ్గుమన్న బీజేపీ శ్రేణులు
కార్టూన్ ప్రచురితమైన తర్వాత తమిళనాడు బీజేపీ (BJP) శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఇది ప్రధానిని అవమానించే విధంగా ఉందని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. వికటన్ వెబ్‌సైట్‌పై కొన్ని గంటల్లోనే బీజేపీ సోషల్ మీడియా విభాగం విమర్శల వర్షం కురిపించింది. దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛ ఉండాలి కానీ, ఇంతగా హద్దులు దాటడం మంచిది కాదని అన్నారు. మన దేశ ప్రధాని మోదీ అని కూడా చూడకుండా ఇలా అగౌరవపర్చడం సరికాదని పేర్కొన్నారు.
Vikatan website .. అనిశ్చితి
వికటన్ వెబ్‌సైట్ భారతదేశంలో పూర్తిగా బ్లాక్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై వికటన్ సంస్థ ఓ ప్రకటనను వెలువరించింది. తమ సంస్థ శతాబ్దం పైగా ప్రజాస్వామ్యానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని పేర్కొంది. తమ వెబ్‌సైట్ ఎందుకు బ్లాక్ అయ్యిందో తెలుసుకునే పనిలో తామున్నామని తెలిపింది. దీనిపపై సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నామని చెప్పింది. ఈ విషయంలో వెనకడుగు మాత్రం వేయబోమని తేల్చి చెప్పింది.
స్పందించని కేంద్ర ప్రభుత్వం
ఈ వివాదంపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. వికటన్ వెబ్‌సైట్ బ్లాక్ (Vikatan website blocked) చేసినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. దీనిపై ఏ మంత్రిత్వ శాఖ చర్య తీసుకుందో స్పష్టత లేదు. బీజేపీ వర్గాలు మాత్రం ఈ కార్టూన్ అసభ్యంగా ఉందని, ప్రధానిని అగౌరవ పరచడం తగదని అంటున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..