- కూల్ డ్రింక్ బాటిల్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు (Plastic waste)?
- కంగుతిన్న కస్టమర్.. ఆశ్చర్యపోయిన షాపు యజమాని
Warangal Viral Video | పండుగలు, పార్టీలకు, చిన్నచిన్న వేడుకల్లో కూల్ డ్రింక్స్ తీసుకోవడం సర్వసాధారణమే కదా.. అయితే మనం తీసుకునే కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివేనా? అవి తీసుకోవడం లాభమా? నష్టమా అనేది పక్కన పెడితే.. అసలు ఆ బాటిల్ ప్యాకింగ్ సమయాల్లో కంపెనీలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా? అనే ప్రశ్నలు వరంగల్ (Warangal) లో జరిగిన షాకింగ్ ఘటనతో ఉత్పన్నమవుతున్నాయి. వివరాల్లోకెళితే వరంగల్ జిల్లా అబ్బనికుంటలో రాఖీ పండుగ రోజున ఓ కూల్ డ్రింక్స్ షాపునకు ఓ వ్యక్తి sprite తాగేందుకు వెళ్ళాడు. షాపు యజమాని కస్టమర్ కు sprite ను 250మి.లీ బాటిల్ ఇవ్వగా, ఆ కస్టమర్ బాటిల్ మూత ఓపెన్ చేసే సమయంలో ఒక్కసారిగా అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను (Plastic waste) చూసి షాకయ్యాడు. సదరు వ్యక్తి ఆగ్రహంతో షాపు యజమానికి చూపించగా అతడు కూడా విస్మయానికి గురయ్యాడు. ఈ క్రమంలో కస్టమర్ కు షాపు యజమానికి పెద్ద గొడవ కూడా జరిగినట్లు సమాచారం. ఆ ఘటనపై కోకకోలా డీలర్ కు ఫిర్యాదు చేయగా ఇప్పటికీ స్పందన లేదని షాపు యజమాని ఆవేదనను వ్యక్తం చేశారు. మరి ఈ ఘటన పై కోకకోలా(Coca Cola) యాజమాన్యం ఎలా స్పందిస్తారో చూడాలి.
అంతేకాకుండా కూల్ డ్రింక్ ప్యాకింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కంపెనీ యాజమాన్యంపై కన్స్యూమర్ కోర్టుకు వెళ్లేందుకు షాపు యజమాని సిద్ధమైనట్లు తెలిసింది.
కూల్ డ్రింక్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు?
కంగుతిన్న కస్టమర్.. ఆశ్చర్యపోయిన షాపు యజమాని
వరంగల్ లో ఆలస్యంగా వెలుగులోకి..#Warangal #viral pic.twitter.com/as1PRF5OMW— Sarkarlive.net (@sarkarlivenews) August 13, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    