డైరెక్టర్ విష్ణువర్ధన్ (Vishnuvardhan)అజిత్ బిల్లా, ఆట ఆరంభం లాంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పంజా మూవీ తీసి స్టైలిష్ డైరెక్టర్ అని అనిపించుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ప్రేమిస్తావా(premisthava) అనే మూవీని డైరెక్ట్ చేశాడు. తమిళంలో రిలీజ్ అయి మంచి హిట్ అయిన ఈ మూవీ ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబు(Mahesh babu)తో తను చదువుకునే రోజుల్లో చేసినటువంటి అల్లరి పనులను చెప్పారు.
చదువుకునే రోజుల్లో అందరూ అల్లరి పనులు చేస్తుంటారు. అందులో ఇప్పుడు స్టార్ లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా చదువుకున్న టైమ్ లో అల్లరి,తుంటరి పనులు చేసే ఉంటారు. వారి విషయాలు ఎక్కువగా బయటికి రావు.ఎవరో వారితో కలిసి చదువుకున్న వారు ఏదో ఒక సందర్భంలో చెబితే తప్ప తెలువదు.
అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పంజా మూవీ తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు క్లాస్మేట్స్ అట. అందులో ఒకే బెంచ్ లో కూర్చునే వారట. బెంచ్ మెంట్స్ అంటే చాలా జ్ఞాపకాలే ఉంటాయి. అలా మహేష్ బాబుతో విష్ణువర్ధన్ (Vishnuvardhan) తనకున్న ఒక జ్ఞాపకాన్ని ఓ పంచుకున్నాడు. విష్ణువర్ధన్, మహేష్ బాబు చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అట. ఎక్కడో ఒక దగ్గర క్వెషన్స్ పేపర్ అమ్ముతున్నారు అని తెలిసి వాటిని కొనడానికి విష్ణువర్ధన్ మహేష్ బాబుని తీసుకెళ్లాడట. ఇలా వారు చేసిన ఓ తుంటరి పనిని నవ్వుతూ చెప్పుకొచ్చాడు విష్ణువర్ధన్. ఇంకా వారు చేసిన చాలా పనులు ఉన్నాయి కానీ పబ్లిక్ గా కొన్ని చెప్పలేమని చెప్పాడు. అలాగే మహేష్ బాబు తో సినిమా అవకాశం వస్తే కచ్చితంగా తీస్తానన్నాడు. ఆయన సినిమాల్లో ఒక్కడు మూవీ చాలా ఇష్టమని చెప్పాడు.
Vishnuvardhan Next Movie : అకిరాతో పంజా 2 !
అలాగే పవన్ తో పంజా చేశారు.. అకిరా కూడా ఎప్పటినుంచో లాంచ్ అవుతారని వినిపిస్తానే ఉంది.. పంజా -2 చేయాల్సి వచ్చిన లేదా వేరే కథతో నైనా పవన్ తనయుడు అకిరాతో(Akira) చేసే అవకాశం వస్తే చేస్తారా అని ఒక విలేకరి అడిగినప్పుడు కచ్చితంగా చేస్తానని ఏదైనా టైం ని బట్టి రావాలని వస్తుందని చెప్పారు.ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అకిరా ఇప్పుడు చామింగ్ ల తయారయ్యాడనన్నారు. ఏదైనా మనం ప్లాన్ చేసే దానికంటే అదే జరుగుతుందని పంజా కూడా అలాగే జరిగిందని చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








