VV Vinayak Venky combo | టాలీవుడ్ లో సుమోలు లేపే డైరెక్టర్ ఎవరంటే ఎవరైనా వీవీ వినాయక్ (VV Vinayak)అనే చెబుతారు. అంతలా ఆడియన్స్ ను తన మాస్ ఎలివేషన్ లతో మెస్మ రై జ్ చేశారు. అందరి హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ చాలా కాలం తరువాత మెగాఫోన్ పట్టబోతున్నారు.చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 (khaidhi no 150) తరవాత వినాయక్ కి అంత రేంజ్ లో హిట్టు పడలేదు.సాయి ధరమ్ తేజ్(sai Dharam tej)తో ఇంటెలిజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
హీరోగా వినాయక్….
ఆ తరవాత కొద్ది గ్యాప్ తీసుకున్న వినాయక్ హీరోగా ఓ మూవీ కూడా అనుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో శీనయ్య (seenayya)అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కొద్ది షూట్ కూడా అయిపోయినా తరవాత మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో మళ్లీ డైరెక్షన్ వైపు వెళ్ళి బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతి రీమేక్ చేశాడు. ఈ మూవీ వినాయక్ కెరీర్ లోనే దారుణమైన ఫ్లాఫ్ మూవీగా నిలిచిపోయింది.
ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్..?
దాదాపు చాలాకాలం స్క్రిప్ట్స్ పై వర్క్ చేసి ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ ను సెట్ చేసినట్టు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ (victory venkatesh)తో ఓ మూవీని ప్లాన్ చేసినట్టు ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు లక్ష్మీ సినిమా వచ్చింది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టు గా నిలిచింది. ఇప్పుడు కూడా అదే జానర్ లో ప్లాన్ చేస్తున్నారట. ఆకుల శివ అందించిన స్టోరీ, మాటలు అలాగే రమణ గోగుల మ్యూజిక్, వినాయక్ టేకింగ్ తో వెంకీ ఫ్యాన్స్ (Venky Fans) చాలామంది కి ఈ మూవీ ఫేవరెట్ గా నిలిచిపోయింది.
మళ్లీ లక్ష్మీ కాంబోలోనే మూవీ…?
మళ్ళీ ఆకుల శివ కథతో, లక్ష్మీ సినిమాను నిర్మించిన నల్లమలపు బుజ్జి ప్రొడ్యూసర్ గా మూవీ తెరకెక్క బోతున్నట్టు తెలుస్తోంది. ఇదే కాంబో మరోసారి రిపీట్ అవుతున్నట్టు తెలిసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.ఇప్పటికే వెంకటేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి కంప్లీట్ చేసి ఈ మూవీకి డేట్స్ ఇస్తారని టాక్. ఈ కాంబోలో రాబోతున్న మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే చేయబోతున్నారట.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








