Sarkar Live

Kothapeta Land Scam | వరంగల్ 3వ డివిజన్‌లో భూ బాగోతం

Kothapeta Land Scam | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కొత్తపేటలో భూ డెవలపర్లు బరితెగించారు. సామాన్యులకు అందని చట్టాలు తమకు చుట్టాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ, ఏకంగా ప్రభుత్వ రోడ్డునే మాయం చేశారు. పబ్లిక్ వినియోగంలో ఉండాల్సిన

Kothapeta Land Scam
  • సర్కారు బాటను మాయం చేసి లేఅవుట్!
  • కొత్తపేటలో రియల్ ఎస్టేట్ ‘మాయా’ జాలం ..

Kothapeta Land Scam | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కొత్తపేటలో భూ డెవలపర్లు బరితెగించారు. సామాన్యులకు అందని చట్టాలు తమకు చుట్టాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ, ఏకంగా ప్రభుత్వ రోడ్డునే మాయం చేశారు. పబ్లిక్ వినియోగంలో ఉండాల్సిన బాటను వెంచర్‌లో కలిపేసి, అదే ప్రభుత్వం నుండి లేఅవుట్ అనుమతులు పొందడం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది.
3 వ డివిజన్ కొత్తపేట ప్రాంతంలోని సర్కారు రోడ్డుకు కొందరు రియల్టర్లు ఎసరు పెట్టారు. నిబంధనల ప్రకారం వదిలిపెట్టాల్సిన ప్రభుత్వ పానాదిని (బాటను) కబ్జా చేసి, పక్కా ప్లాన్‌తో వెంచర్‌ (Kothapeta Land Scam )గా మార్చేశారు.

క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్డును రికార్డుల్లో మాయం చేయడమే కాకుండా, అధికారుల కళ్లు గప్పి లేదా వారి సహకారంతోనే ఈ అక్రమ లేఅవుట్‌కు అనుమతులు సాధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నా, సంబంధిత రెవెన్యూ మరియు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ రోడ్డును కలుపుకుని వెంచర్ వేసి ప్లాట్లు విక్రయిస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు చేయకుండా వెంచర్ కు అనుమతి ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోందని స్థానికులు చెబుతున్నారు.

Layout Permission

స్థానికుల ఆగ్రహం: వెంటనే రద్దు చేయాలి!

ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసి ప్రైవేట్ వెంచర్‌ చేయడంపట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • “అక్రమ లేఅవుట్‌కు అనుమతులు ఎలా వచ్చాయి?” “క్షేత్రస్థాయి పరిశీలనలో విఫలమైంది ఎవరు?” అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సదరు లేఅవుట్ అనుమతులను రద్దు చేయాలని, కబ్జాకు గురైన ప్రభుత్వ రోడ్డును కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?