వరంగల్ (Warangal)లో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల (iron bars) లోడు రెండు ఆటోలపై పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి (instant death) చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్-మామునూరు రహదారిపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
ఓవర్ లోడ్.. ఓవర్‌టేక్
రైల్వే ట్రాక్స్ (railway track)కు ఉపయోగించే ఇనుప రాడ్లను తరలిస్తున్న లారీ భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే రెండు ఆటో రిక్షాలను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది. వేగంగా ముందుకు దూసుకెళ్లే క్రమంలో అందులోని ఇనుప రాడ్లు కదలి ఆ ఆటోలపై పడ్డాయి. దీంతో ఏడుగురు దుర్మణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. వీరి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Warangal Accident : క్షతగాత్రుల పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని స్థానికులు, పోలీసులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రి ( MGM Hospital)కి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
మద్యం మత్తులో లారీ డ్రైవర్
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘోర సంఘటనకు ప్రధాన కారణమని పోలీసులతోపాటు స్థానికులు భావిస్తున్నారు.
సరిగా లోడ్ చేయకపోవడంతో..
లారీపై ఇనుప రాడ్లను సరిగా లోడ్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం (Road Accident) జరిగిందని స్థానికులు అంటున్నారు. ఈ రహదారిపై భారీ వాహనాలు వేగంగా ప్రయాణిస్తుంటాయని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అనేక మంది బలవుతున్నారని అంటున్నారు. భారీ వాహనాలను రద్దీని నియంత్రించాల్సిన పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో ప్రమాదాలు పరిపాటిగా మారాయని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వాహనాలను నిత్యం తనిఖీలు చేయాలని, డ్రైవర్ల స్థితిని పరిశీలించాలని కోరుతున్నారు. అలాగే లోడ్‌తో వస్తున్న లారీలను ఆపి సరైన పద్ధతిని పాటించారా.. లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








