వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యేదెన్నడు?
Warangal Collectorate | వరంగల్ నగర ప్రజల అభివృద్ధికి మూలస్తంభంగా నిలవాల్సిన కలెక్టరేట్ భవనం ఇప్పటికీ పూర్తి కావడం లేదు. 2023 జూన్ 17న ఈ సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటికే 25 నెలలు గడుస్తున్నా, పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించడంలేదు.
ప్రతిరోజూ పనులు జరిగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆశించినంత వేగం లేదు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ సమీకృత భవన నిర్మాణ పనులు జాప్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ జిల్లాలోని ప్రజల అభివృద్ధి కలలన్నీ కొలువుదీరే కేంద్రంగా ఆశించిన కొత్త కలెక్టరేట్ భవనం ఇప్పటికీ ‘పూర్తి’ రూపం దాల్చకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.అధికారికంగా నిర్మాణం ప్రారంభించి 25 నెలలు గడుస్తున్నా పనుల పురోగతిలో జాప్యం ఏర్పడడంతో కార్యాలయం ప్రారంభంపై పలురకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.త్వరలో కలెక్టరేట్ నిర్మాణం పూర్తి అవుతుందన్న హామీలు నిత్యం వినిపిస్తున్నప్పటికి అసలు ఆ భవనం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.నిత్యం కేవలం ఇటుకలు కదులుతున్నాయి తప్ప పురోగతిగా చెప్పుకోదగ్గ చిహ్నాలేవీ కనిపించకపోవడంతో అసలు కలెక్టరేట్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?ఎప్పుడు తమకు అందుబాటులోకి వస్తుందో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు.
Warangal Collectorate : నత్తనడకన పనులు..
ప్రజలందరికి ప్రభుత్వ సేవలను ఒకే దగ్గర అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయ భవనాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో వరంగల్ జిల్లాలో కూడా కలెక్టరేట్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ చేపట్టిన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు (సమీకృత జిల్లా కార్యాలయాల భవనం) నత్తనడకన కొనసాగడం ప్రజల్లో అసంతృప్తి కి కారణమవుతుందని తెలుస్తోంది. 17-06-2023 లో శంకుస్థాపన జరిగిన ఈ భవనం 25 నెలలు గడుస్తున్నా నేటికి పూర్తికాకపోవడం, కనీసం ఫలానా తేదీలోపు కలెక్టరేట్ ప్రారంభం చేస్తామని ప్రభుత్వం ప్రకటించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపి సమీకృత భవనాల (కలెక్టరేట్) కార్యాలయం త్వరితగతిన పూర్తి చేసి,ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.