Warangal Court Bomb Threat : వరంగల్ కోర్టులో ఈ రోజు ఉదయం భారీ కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబు ఉంచినట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి న్యాయమూర్తికి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు (Bomb Threa) సందేశం పంపాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కోర్టు పరిసరాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో కోర్టు పనులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఉద్యోగులు, న్యాయవాదులు,కక్షిదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Bomb Threat : అణవణువూ సోదాలు
వరంగల్ కోర్టుకు చేరుకున్న పోలీసులు అణువణువూ సోదాలు (Police Investigation) చేశారు. బాంబ్ స్క్వాడ్ (Bomb Squad Search), కేనైన్ (Police Canine Unit) టీమ్ సహాయంతో కోర్టు (Warangal Court) భవనం, ఆవరణను పూర్తిగా తనిఖీ చేశారు. గంటల తరబడి జరిగిన ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఈ బెదిరింపు సమాచారం (Fake Threats ) అబద్ధమని తేలింది.
ముమ్మరంగా దర్యాప్తు
బాంబు బెదిరింపపుల ఈ-మెయిల్ (Hoax Bomb Email) పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ (Cybercrime ) పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను భయాందోళన (Public Panic in Court)కు గురిచేసే వారి పై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Bomb Threat : కోర్టు కార్యకలాపాల పునరుద్ధరణ
కోర్టు ((Warangal Court) ఆవరణలో ఎలాంటి బాంబు లేదని తేలడంతో ఉద్యోగులు, న్యాయవాదులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు తనిఖీలు ముగించి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసిన తర్వాత కోర్టు పనులు తిరిగి యథావిధిగా (Court Operations Resumed) ప్రారంభమయ్యాయి. ఈ ఘటనతో నగరంలో కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న చివరకు అది అవాస్తవమని తేలడంతో అందరూ ఊరట చెందారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..