Warangal Jakaria : వరంగల్ శివనగర్ కు చెందిన జమాత్–ఉల్–ముస్లిమీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జకారియాను చైన్నె ఇమ్మిగ్రేషన్ అధికారులు (Immigration officers) అదుపులోకి తీసుకొని విచారించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే..
కాగా దీనిపై జకారియా ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. తన బాధను వెల్లబోసుకున్నారు. వరంగల్‌లో ఉగ్ర మూలాలు ఉన్నాయంటూ సామాజిక మాద్యమాల్లో జరిగిన ప్రచారం అంతా వట్టిదేననని తెలిపారు. తనకు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధాలు లేవని వరంగల్ కు చెందిన జకారియా కొట్టిపారేశారు. మూడు రోజులపాటు విచారణ అనంతరం తనకు నిషేధిత సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఎన్ఐఏ అధికారులు గుర్తించారని తెలిపారు. శ్రీలంకకు వెళ్తుండగా అనుమానంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని, పూర్తిస్థాయి విచారణ జరిపి వదిలివేసినట్లు జకారియా వెల్లడించారు.
ఇదిలా ఉండగా 15 మంది సభ్యులతో కలిసి శ్రీలంకకు వెళ్లి వెళ్తుండగా అతడిని అదుపులోకి ప్రశ్నించినట్లు తెలిసింది. అతడి వద్ద బైత్ ఫామ్ (తమ వర్గంలో ఇతర వర్గానికి చెందిన ముస్లింలు చేరుతున్నట్లు దస్త్రంపై సంతకాలు)లు లభించడంతో అధికారులు అనుమానంతో విచారించి వదిలేశారు. కాగా జమాత్–ఉల్–ముస్లిమీన్‌కు సంబంధించిన ప్రధాన కార్యాలయం జహీరాబాద్‌లో ఉంది. తాండూరు, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఈ సంస్థకు చెందిన సభ్యులు ఉన్నారు. ఈ సంస్థపై భారత్ లో నిషేధం లేదు..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








