Warangal Mamnoor Airport | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమానంగా, ఆధునిక సదుపాయాలతో వరంగల్ సమీపంలోని మామునూర్ వద్ద కొత్త విమానాశ్రయ నిర్మాణం (Mamnoor Airport) జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం తాజాగా రూ.90 కోట్ల నిధులను అదనంగా మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లుచ భవనాల (విమానాశ్రయాలు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
రైతులకు నష్టపరిహారం
గతంలోనే ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి కొత్తగా విడుదలైన నిధులతో కలిపి భూసేకరణ కోసం మొత్తం 295 కోట్లను కేటాయింట్లు అయింది. భూములను కోల్పోతున్న రైతులు, యజమానులకు నష్టపరిహారం చెల్లించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ఈ నిధులు బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయం నిర్మాణం (Mamnoor Airport), అభివృద్ధి కోసం మొత్తం 280 ఎకరాల 30 గుంటల భూమి సేకరణ బాధ్యత వరంగల్ జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఈ పనులు త్వరలో వేగం పుంజుకోనున్నాయి.
అనుమతుల సమస్యకు పరిష్కారం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త విమానాశ్రయాలు నిర్మించరాదనే ఎక్స్‌క్లూజివిటీ క్లాజ్ కారణంగా ముందుగా తీవ్ర చోటుచేసుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (HIAL) నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందడం వల్ల అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా విమానాశ్రయాలు
తెలంగానలో పెద్దాపల్లి జిల్లా అంతర్గాం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు కోసం కూడా ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపింది. కన్సల్టెన్సీ ఫీజుల కోసం ₹40.43 లక్షలను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) సిద్ధం చేయడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీని కన్సల్టెంట్‌గా నియమించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    