- వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గతేడాది తో పోలిస్తే 3.21% తగ్గుదల
- మీడియా సమావేశంలో నేరాల వివరాలు వెల్లడించిన కమిషనర్ అంబర్ కిషోర్ ఝా..
Warangal Police Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచి నేరాల సంఖ్యను తగ్గించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2023 లో 14,731 కేసులు నమోదు కాగా, 2024 ప్రస్తుత సంవత్సరం ఆ సంఖ్య కాస్త 14406 కు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 3.21% క్రైమ్ రేట్ తగ్గినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వెల్లడించారు. నేరాలను నియంత్రించడంలో కమిషనరేట్ పోలీసులు సక్సెస్ అయినట్లు, పోలీసుల సమష్టి కృషితోనే ఈ ఏడాది నేరాలు అదుపులో ఉండటంతో పాటు తగ్గుముఖం పట్టినట్లు చెప్పవచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ నివేదిక ను మీడియా సమావేశంలో కమిషనర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పోలీసులు ముందస్తు ప్రణాళికలు, సమాచారంతోనే నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం జరిగిందని, నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని అన్నారు. గతేడాదితో పాటు ప్రస్తుత ఏడాది లో జరిగిన నేరాల వ్యత్యాసాలను పోలీస్ కమిషనర్ మీడియా ప్రతినిధులకు వివరించారు. గత సంవత్సరం (2023)తో పోల్చుకుంటే ప్రస్తుత సంవత్సరం (2024)లో హత్య లు 16.67 శాతం తగ్గాయని, ఆస్తినేరాలకు సంబంధించి స్వల్పంగా 2.23 శాతం తగ్గడంతో పాటు 11 కోట్ల 81 లక్షల రూపాయల విలువ గల చోరీ సోత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు చెప్పారు.
మహిళలకు సంబంధించిన నేరాలు తగ్గాయ్..
CRIME AGAINST WOMEN | ||||||
a | Harassment against women | 658 | 624 | 34% | Decreased | |
b | Rape | 189 | 143 | 46% | Decreased | |
c | Dowry Death | 20 | 10 | 10% | Decreased | |
d | Molestation (354 IPC) | 402 | 364 | 38% | Decreased | |
TOTAL | 1269 | 1141 | 11% | Decreased |
Warangal Police Commissionerate లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు 11 శాతం, మోసాలు 16 శాతం, అపరహణ కేసులు 7.45 శాతం చొప్పున గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం తక్కువ కేసులు నమోదయ్యాయి. పోలీసులు తీసుకున్న ప్రత్యేక చోరవతోనే రోడ్డు ప్రమాదాలను నివారించడంలో విజయం సాధించినట్లు తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2023 సంవత్సరంలో 1558 రోడ్డు ప్రమాదాలు జరగగా, ప్రస్తుత సంవత్సరం(2024) లో 1434 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో గత సంవత్సరం 499 మంది మరణించగా, ఈ ఏడాది 417 మంది మరణించినట్లు కమిషనర్ స్పష్టం చేసారు.ఈ సంవత్సరంలో సైబర్ నేరాలకు సంబంధించి 772 కేసులు నమోదు కావడంతో పాటు సైబర్ నేరాగాళ్ళ నుండి సుమారు ఒక కోటి 30 లక్షల రూపాయలను బాధితులకు ఇప్పించినట్లు కమిషనర్ తెలిపారు.
రూ.2.63 కోట్ల విలువైన గంజాయి సీజ్
మత్తు పదార్థాలకు సంబంధించి 147 కేసుల్లో సుమారు 2కోట్ల 63లక్షల రూపాయల విలువ గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు 321మంది నేరస్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.నేరాలకు సంబంధించి కమిషనరేట్ పోలీసులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయడంతో పాటు తగిన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించడంతో 2462 మందిపై శిక్షలు విధించినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఈస్ట్‌జోన్ డిసిపి రవీందర్, ఎ.ఎస్పీ మనాన్ భత్, అదనపు డిసిపి రవి, ఎసిపిలు జితేందర్ రెడ్డి, డేవిడ్‌రాజు, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Sl.No | CRIME HEAD | Cases in2023 | Cases in 2024 | % of Increase/Decrease | Whether increased/decreased |
BODILY OFFENCES | |||||
1. | Murders | 48 | 40 | 16.67% | Decreased |
Attempt Murder | 129 | 107 | 17.06% | Decreased | |
Hurts | 1573 | 1600 | 2.69% | Increased | |
Rioting | 77 | 56 | 27.28% | Decreased | |
PROPERTY OFFENCES | |||||
All types of Property offences | 924 | 945 | 2.23% | Increased | |
KIDNAPPING | |||||
Kidnapping | 188 | 174 | 7.45% | Decreased | |
ROAD ACCIDENTS | |||||
3. | Road Accidents | 1558 | 1434 | 7.94% | Decreased |
4. | OTHER IPC | ||||
5. | Other IPC (Cheating, Nuisance etc. | 5569 | 5857 | 4.92% | Increased |
TOTAL | 10066 | 10213 | 1.44% | Increased |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..