- జీవో నెంబర్ 257 ను తుంగలో తొక్కిన సబ్ రిజిస్ట్రార్
- సబ్ రిజిస్ట్రార్ పై ఇంచార్జి డి ఆర్ ఎలా స్పందిస్తారో ?
Warangal News | వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) గా విధులు నిర్వహిస్తున్న సైదులు గుట్టుచప్పుడు కాకుండా జీవో నెంబర్ 257 అతిక్రమించి అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయగా తెలిసింది. పైకి సత్యహరించంద్రుడిలా కనిపించే ఈ అధికారి లోలోపల మాత్రం తన వక్రబుద్దితో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసి గట్టిగానే దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విధులు నిర్వహించినప్పుడు జీవో నెంబర్ 257 ను అతిక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసినందుకు గాను సదరు అధికారి పై సస్పెన్షన్ వేటు పడగా ఇప్పుడు మళ్లీ అదే దారిలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేయడం గమనార్హం.
వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ గా గత కొన్ని నెలల క్రితం బాధ్యతలు తీసుకున్న సైదులు అమ్యామ్యాలకు తలొగ్గి స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ పాల్పడ్డారు. వాటిలో మచ్చుకు కొన్ని డాక్యుమెంట్ నెంబర్ లు.. ఇక్కడ పేర్కొంటున్నాం.
- 5733/2024
- 4443/2024
- 4441/2024
- 2962/2024
- 2961/2024
ఇంచార్జి డీఆర్గా బాధ్యతలు చేపట్టనున్న ప్రవీణ్ కుమార్ ఎలా స్పందిస్తారో అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గతంలో ఇప్పటికే ఈ సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం – ఇప్పుడు మరోసారి ఈ ఘటనలపై ఎలా స్పందిస్తుందో చూడాలి
ప్రశ్నలు వీటికీ సమాధానాలు రావాల్సిందే:
- ఒకసారి సస్పెండ్ అయిన అధికారి మళ్లీ అదే విధంగా జీవోను ఉల్లంఘించడం ఏమిటి?
- శాఖ అధికారుల తీరు ఎందుకు మారడం లేదు?
- నూతన డీఆర్ ప్రవీణ్ కుమార్ దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తారా?
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.