- ట్రాఫిక్‌లో డ్యూటీలు, పోస్టింగులు నలుగురు హోంగార్డుల చేతిలోనట..!
- వైన్ షాపులు, బార్లు, షాపింగ్ మాళ్ల వద్ద నెలవారీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ?
- కమిషనరేట్ పరిధిలో హోంగార్డులే తమ సహచరులపై బహిరంగ విమర్శలు
- ఓ అధికారి కొడుకు పుట్టిన రోజు వేడుకలకూ ఫండ్ వసూలు.. ?
Warangal Traffic | వరంగల్ ట్రాఫిక్ లో “చతుర్దందం’జోరుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి నచ్చితే “ఓకే” లేదంటే ‘నో” అనే స్థాయిలో అధికారులు ఉన్నారంటే వారు ఏ స్థాయిలో ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి కలిగి ఉన్నారో, ఆ నలుగురు ఏ స్థాయిలో అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. వరంగల్ ట్రాఫిక్ ( Warangal Traffic Department) కు ఏ హోంగార్డు రావాలన్న? ట్రాఫిక్ లో ఉన్న ఏ హోంగార్డు (Home Guards) అదే ప్రాంతంలో కొనసాగలన్నా వీరిని తప్పనిసరిగా ప్రసన్నం చేసుకోవాల్సిందేనని తెలుస్తోంది. అంతేకాకుండా నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయడం, వసూళ్లు చేసిన మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి వివిధ స్థాయిలో వాటాల రూపంలో ఉన్నతాధికారులకు అప్పగించడంలో వీరు ఆరి తేరినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆ నలుగురి జోరు..
వరంగల్ ట్రాఫిక్ లో హోంగార్డ్ లుగా విధులు నిర్వహిస్తున్న ఆ నలుగురు మొత్తం వరంగల్ ట్రాఫిక్ విభాగాన్నే శాసిస్తున్నట్లు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ లో కొనసాగలన్నా? కొత్తగా ఆ పరిధిలోకి హోంగార్డ్ లు రావాలన్న వీరి అనుమతి తప్పనిసరి అని కమిషనరేట్ పరిధిలోని హోంగార్డ్ లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ట్రాఫిక్ విభాగంలోని అధికారులు సైతం వీరు చెప్పిందే వింటారని, డ్యూటీ లు కేటాయించే పెద్దసారు కూడా వీరి మాటకే ప్రాధాన్యం ఇస్తారని కొంతమంది హోంగార్డ్ లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.గత కొంతకాలంగా వరంగల్ ట్రాఫిక్ లో తిష్ట వేసిన వీరు ట్రాఫిక్ ను వీడకుండా ఉన్నతాధికారులను గట్టిగానే ప్రసన్నం చేసుకొని తమ గుప్పిట్లో ఉంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
వసూళ్లు చేస్తారు.. వాటాలు పంచుతారు?
వరంగల్ ట్రాఫిక్ (Warangal Traffic Department) లో ఆ నలుగురు హోంగార్డు ల హహ మాములు గా ఉండదట. వరంగల్ ట్రాఫిక్ పరిధిలోని బార్లు, వైన్ షాపులు, షాపింగ్ మాళ్లు,వివిధ రకాలైన కమర్షియల్ దుకాణాల వద్ద నుండి వీరు నెలవారి మామూళ్లు (Corruption) వసూళ్లు చేయడంలో సిద్ధహస్తులని ,వీరు నెలవారీ మామూళ్లు వసూళ్లు చేసి వివిధ స్థాయిలో వాటాలు పంచుతారని ప్రచారం జరుగుతోంది. మామూళ్లు వసూళ్లు చేయడంలో ఆ నలుగురు ఆరితేరారు గనుకనే వీరికి ఉన్నతాధికారులు సైతం పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. వరంగల్ ట్రాఫిక్ లో విధులు నిర్వహిస్తున్న ఆ నలుగురి లీలలపై కమిషనరేట్ పరిధిలోని హోంగార్డ్ లే విమర్శలు చేయడం కొసమెరుపు. ఇదిలా ఉంటే ఇటీవలే ఓ పెద్ద సారు కొడుకు పుట్టినరోజు కు ఈ నలుగురు కలిసి మిగిలిన వాళ్లదగ్గర కొంత మొత్తాన్ని ఫండ్ రూపంలో కలెక్ట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు,ఆ వేడుకల్లో పూర్తిస్థాయిలో సేవలందించినట్లు కమిషనరేట్ (Warangal Police Commissionerate) పరిధిలోని హోంగార్డ్ లు గుసగుసలాడుకోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    