Cold wave | హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి దిగజారే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (IMD-హైదరాబాద్) ప్రకారం.. జనవరి 8 నుంచి 10 మధ్య తెలంగాణ రాష్ట్రం అంతటా బలమైన చలిగాలులు వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. “రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే చాన్స్ ఉందని పేర్కొంది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణపై ఉదయం వేళల్లో పొగమంచు లేదా పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని IMD-హైదరాబాద్ తెలిపింది.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వాతావరణ నిపుణులు X లో తెలంగాణ వెదర్‌మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన టి బాలాజీ మాట్లాడుతూ, “జనవరి 8, 11వ తేదీలలో తెలంగాణలోని ఉత్తర ప్రాంతాలు బలమైన చలిగాలులు వ్యాపిస్తాయని వెల్లడించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో జనవరి 9 మరియు 10 తేదీలలో బలమైన చలిగాలులు వీస్తాయి, ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్, 9 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయి.
ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని జిల్లాల్లో చలి వాతావరణం కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.6 డిగ్రీల సెల్సియస్, 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవగా, జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్, 14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు
Hyderabad Cold wave : మంగళవారం హైదరాబాద్‌లోని టాప్ 5 చల్లని ప్రదేశాలు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) క్యాంపస్: 11.6 డిగ్రీల C; మౌలా అలీ/ ఉప్పల్: 11.8 డిగ్రీల సి; రాజేంద్రనగర్: 12.2 డిగ్రీల సి; బీహెచ్ఈఎల్ రామచంద్రపురం: 12.2 డిగ్రీల సెల్సియస్; మచ్చ బొల్లారం/ అల్వాల్: 13.5 డిగ్రీలు నమోదయింది.
జిల్లాల్లో టాప్ 5 చల్లని ప్రదేశాలు:
కోహీర్ (సంగారెడ్డి): 9 డిగ్రీల సెంటీగ్రేడ్, తిర్యాణి (కొమరంభీం ఆసిఫాబాద్): 9.6 డిగ్రీలు; సిర్పూర్ (కొమ్రంభీం ఆసిఫాబాద్): 9.7 డిగ్రీల సెల్సియస్; మొయినాబాద్ (రంగారెడ్డి): 10.3 డిగ్రీలు; షాబాద్ (రంగారెడ్డి): 10.3 డిగ్రీల సింటిగ్రేడ్.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..