Trivikram Movies | ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా వరకు పాన్ ఇండియన్ (Pan India movies) లెవల్లో తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు అదే ట్రెండు… ఏ కథకైనా పాన్ ఇండియన్ హంగులు అద్ది వారి మార్కెట్ ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే రాజమౌళి(Rajamouli), సుకుమార్ (Sukumar)లాంటి చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియన్ మూవీ లు తీసి మార్కెట్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి త్రివిక్రమ్ (Trivikram) కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మూవీతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ మూవీ కలెక్షన్ లకు బాక్సా ఫీస్ షేక్ అయింది. రెండు పార్ట్ లుగా తెరకెక్కించి కథను ఇలా కూడా తీయొచ్చు అని చాటి చెప్పింది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే భయపడే డైరక్టర్లు… ఇప్పుడు పార్టులుగా మూవీని తీసి బ్లాక్ బ్లస్టర్లు కొడుతున్నారు.
టాలీవుడ్ (Tollywood) నుండి ఒక మూవీ అనౌన్స్ చేస్తే చాలు ప్రతీ ఇండస్ట్రీ ఆ మూవీ గురించి ఆరా తీస్తుందంటే అతిశయోక్తి కాదు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీతో ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ని తీసే పనిలో ఉన్నాడు. రాజమౌళి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పేరు సుకుమార్. నాన్నకు ప్రేమతో మూవీ వరకు ఓ మాదిరి హిట్లు కొట్టిన సుకుమార్ పుష్పతో తన రేంజ్ మారిపోయింది. ఆ మూవీతో పాన్ ఇండియన్ సినిమా డైరెక్టర్ల లిస్టులో టాప్ లోకి వెళ్లిపోయాడు. నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో మూవీ తీయబోతున్నాడు. అది కూడా పాన్ ఇండియన్ సబ్జెక్ట్. ఆ తర్వాత పుష్ప-3 ఎలాగూ ఉండనే ఉంది. ఈ మూవీస్ తో సుకుమార్ మరింతగా తన మార్కెట్ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఇలా చాలా మంది జూనియర్ డైరెక్టర్లు కూడా వారి కథలను పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కించే పనిలో ఉన్నారు.
Trivikram Movies : నువ్వే నువ్వే సినిమాతో..
నువ్వే నువ్వే తో డైరెక్టర్ గా మారిన మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ (Director Trivikram Srinivas) ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ తీశాడు. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత అనే యాక్షన్ మూవీ తీసి మెప్పించారు. తన తోటి డైరెక్టర్లు పాన్ ఇండియన్ లెవెల్ లో మూవీస్ తీస్తూ వారి మార్కెట్ ని పెంచుకుంటుంటే త్రివిక్రమ్ మాత్రం ఇప్పటికే ఆలస్యం చేశాడని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ తో (Allu Arjun)తను తీయబోయే సినిమాతో వారి కోరిక తీరనుంది. వారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ పాన్ ఇండియన్ లెవెల్ లోనే తీయబోతున్నాడట. ఈ మూవీ మైథాలజికల్ జానర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పురాణాలపై విపరీతమైన పట్టు ఉన్నా త్రివిక్రమ్ భారీ హిట్టు కొట్టి పాన్ ఇండియన్ డైరెక్టర్ అని అనిపించుకోవడం ఖాయం అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా అయిపోయినట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప, పుష్ప-2 (Pushpa 2) లతో అల్లు అర్జున్ మార్కెట్ పెరిగింది. కరెక్ట్ టైంలో అల్లు అర్జున్ తో మూవీ తీస్తున్నాడని, ప్రెజెంట్ మైథలాజికల్ జానర్ లో వస్తున్న మూవీస్ కి ఆదరణ ఎక్కువగా ఉండడంతో త్రివిక్రమ్ కరెక్ట్ సబ్జెక్టు ఎంచుకున్నాడని మూవీ లవర్స్ అనుకుంటున్నారు. ఈ మూవీతో పాన్ ఇండియన్ టాప్ డైరెక్టర్ల లిస్టులో కచ్చితంగా చేరుతాడని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు మూవీ టీం మాత్రం ఏ జానర్ లో మూవీ తీస్తున్నారో అని అఫీషియల్ గా ప్రకటించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








