మహిళా పోలీస్ స్టేషషన్ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) కి పట్టుబడ్డాడు. కుటుంబ కలహాలతో అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఓ వ్యక్తి గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్కు వచ్చాడు. ఆ కేసు విచారణ చేస్తున్న ఎస్సై వేణుగోపాల్ బాధితుడి మీద అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేస్తానని, కేసు లేకుండా చూసుకుంటానని అందుకు తనకు కొంత మొత్తం (Bribe ) ఇవ్వాలని ఒప్పందంకుదుర్చుకున్నాడు.
దీనికి బాధితుడు అంగీకరించి లంచమిచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు గురువారం సాయంత్రం గచ్చిబౌలి మహిళా పోలీస్టేషన్ ఎస్సై వేణుగోపాల్ బాధితుడి వద్ద నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేణుగోపాల్ ఇటీవలే పదోన్నతిలో భాగంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.