Sarkar Live

Day: April 29, 2025

GHMC : జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్.వి కర్ణన్
Hyderabad, State

GHMC : జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్.వి కర్ణన్

Hyderabad : జిహెచ్ఎంసి (GHMC) కమిషనర్‌గా ఆర్.వి. కర్ణన్ (RV Karnan) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆర్.వి. కర్ణన్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా నియమితులయ్యారు. బదిలీపై వెళుతున్న కమిషనర్ కె. ఇలంబర్తి నుంచి ఆర్వి కర్ణన్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సేవలందించిన ఆర్.వి. కర్ణన్, హైజీన్ ప్రమాణాలను ఉల్లంఘించిన రెస్టారెంట్లు, పబ్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు వంటి ఆహార సంస్థలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఆహార భద్రతపై ప్రజలలో అవగాహన పెంచారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా కొనసాగిన కె.ఇలంబర్తి జిహెచ్ఎంసి కమిషనర్‌గా తన పదవీకాలంలో నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పౌర సేవల మెరుగుదల కోసం పలు కార్యక్రమాలు చేపట్ట...
Modi Visit | అమ‌రావ‌తికి పీఎం మోదీ.. రాజ‌ధాని ప‌నుల‌కు శ్రీ‌కారం
State

Modi Visit | అమ‌రావ‌తికి పీఎం మోదీ.. రాజ‌ధాని ప‌నుల‌కు శ్రీ‌కారం

Modi Visit : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమరావతి (Amaravati)లో పర్యటించనున్నారు. రాజధాని పనుల (capital city's construction works) పునఃప్రారంభానికి మే 2న ఆయన రానున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (state government) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ (Minister P. Narayana) ఈ రోజు అమరావతిలో పర్యటించారు. మోదీ టూర్‌కు సంబంధించిన‌ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ్ తదితరుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. Modi Visit : రాజధాని పనులకు ఊతం రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న ప్ర‌తిష్టాత్మ‌కం (prestigious)గా మారింది. ఆయ‌న రాక‌తో రాజధాని నిర్మాణానికి (capital city's cons...
Solar Panels | సోలార్ రంగంలో అద్భుత ఆవిష్క‌ర‌ణ.. వీటి ఉపయోగం ఏమిటి?
Technology

Solar Panels | సోలార్ రంగంలో అద్భుత ఆవిష్క‌ర‌ణ.. వీటి ఉపయోగం ఏమిటి?

Ultra-thin Solar Panels ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పునరుత్పాదక శక్తి వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సౌరశక్తి (solar power generation) అనేది దైనందిన చ‌ర్య‌ల్లో కీల‌క వ‌న‌రుగా మారుతోంది. కాలుష్య ర‌హితంగా సుల‌భ‌మైన ప‌ద్ధ‌తిలో అపార విద్యుత్ శ‌క్తిని ఉత్ప‌త్తి చేసే ఈ విధానం ఎంతో వేగంగా విస్త‌రిస్తూ మ‌రెన్నో విప్ల‌వాత్మ‌క మార్పులతో మ‌న‌ముందుకు వ‌స్తోంది. సోలార్ సిస్టంలో రోజురోజుకూ కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా అమెరికా శాస్త్ర‌వేత్త‌లు రూపొందించిన‌ సోలార్ ప్యానెల్స్ వినూత్న ఆలోచ‌న‌ల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. కాగితంగా క‌న్నా ప‌లుచ‌టి ప‌రిమాణంతో అతి త‌క్కువ బ‌రువుతో సోలార్ ప్యాన‌ల్స్ (ultra thin solar panels) మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ultra-thin Solar Panels : సాంకేతికత పుట్టిందెక్కడ? అమెరికాలోని ప్రముఖ‌ విద్యా సంస్థ Massachusetts Institute o...
Train robbery | రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌
Crime

Train robbery | రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌

Train robbery : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి (Gutti in Anantapur district) దగ్గర నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (Rayalaseema Express)లో సోమ‌వారం అర్ధ‌రాత్రి దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. ఆగి ఉన్న రైలులోకి వచ్చి ప్రయాణికుల దగ్గర ఉన్న బంగారం, డబ్బులు, విలువైన వస్తువులు (Train robbery) ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్‌ప్రెస్ (Amaravati Express) వెళ్లడానికి దారి ఇవ్వడానికి గుత్తి దగ్గర రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉండ‌గా దొంగలు ఆ రైలులోని 10 బోగీల్లోకి ఎక్కారు. ప్ర‌యాణికుల‌ను బెదిరించి వ‌రుస‌గా ఒక్కొక్క‌రి నుంచి ఆభ‌ర‌ణాలు, డ‌బ్బులు, విలువైన వ‌స్తువులు దోచుకున్నారు. దీంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. 20 మంది బాధిత ప్రయాణికులు (affected passengers) ఈ ఘ‌ట‌న‌పై తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Tr...
High Alert | పాకిస్తాన్ కాల్పులు… తిప్పికొట్టిన భార‌త్
National

High Alert | పాకిస్తాన్ కాల్పులు… తిప్పికొట్టిన భార‌త్

High Alert : నియంత్రణ రేఖ (Line of Control - LoC) వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ (Pakistan) కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు (provocative firing) జరుపుతుండటంతో భారత భద్రతా దళాలు (security forces) అప్రమత్తం (High Alert)గా ఉండి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ చిన్న ఆయుధాలతో కాల్పులు ప్రారంభించింది. భారత సాయుధ దళాలు ఈ చర్యకు తక్షణమే స్పందించాయి. ఈ నేప‌థ్యంలో స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఉగ్రవాదుల‌ చొరబాటు ప్రయత్నాలు! పాకిస్తాన్ ప్రస్తుతం భయానక స్థితి (panic)లో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సరిహద్దుల్లో (border) కాల్పులు జరపడానికి ఇది ఒక కారణమ‌ని తెలుస్తోంది. ఈ కాల్పులు చొరబాటుదారులకు, క్రియాశీల ఉగ్రవాదులకు కవర్ ఫైర్‌గా ఉపయోగపడే అవకాశం ఉంది. సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను చొప్పించే ప్రయత్నం...
error: Content is protected !!