నిబంధనలు గాలికి.. ఫీజులే లక్ష్యం ‘నాగేశ్వరరావు ట్యూషన్స్’ ఆగడాలు – Fee Looting
Fee Looting in Hanumakonda | విద్య ముసుగులో వ్యాపారం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న 'నాగేశ్వరరావు ట్యూషన్స్' తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ, భద్రతా ప్రమాణాలను విస్మరించి ఈ సంస్థ సాగిస్తున్న 'ఫీజుల దోపిడీ' ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అనుమతులు లేవు.. అన్నీ అక్రమమే!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా ట్యూషన్ సెంటర్ నిర్వహించాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి. కానీ, నాగేశ్వరరావు ట్యూషన్స్ యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండానే హన్మకొండ, వరంగల్, నర్సంపేట వంటి ప్రధాన కేంద్రాల్లో యథేచ్ఛగా బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. ఆకర్షణీయమైన ప్రకటనలతో తల్లిదండ్రులను నమ్మిస్తూ, భారీగా ఫీజులు వసూలు చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.
గొర్రెల మందల్లా విద్యార్థులు.. కనీస వసతులు శూన్యం
ఈ ట్యూషన్ సెంటర్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సంస్...


