Sarkar Live

సర్వే నెం 704లోని ప్రభుత్వ రోడ్డు ఆక్రమణపై కలెక్టర్ ఉక్కుపాదం – Road Encroachment

Paidipally Road Encroachment | గ్రేటర్ వరంగల్ పరిధిలోని 3 వ డివిజన్ పైడిపల్లి రెవెన్యూ శివారు లోని ప్రభుత్వ రోడ్డును తమ వెంచర్ లో కలుపుకున్న ప్రైవేట్ వెంచర్‌ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు సిద్ధమైంది. ‘సర్కార్ లైవ్‘

Paidipally Road Encroachment
  • క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల సర్వే!
  • సర్కార్ లైవ్ కథనాలకు స్పందించిన జిల్లా కలెక్టర్

Paidipally Road Encroachment | గ్రేటర్ వరంగల్ పరిధిలోని 3 వ డివిజన్ పైడిపల్లి రెవెన్యూ శివారు లోని ప్రభుత్వ రోడ్డును తమ వెంచర్ లో కలుపుకున్న ప్రైవేట్ వెంచర్‌ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు సిద్ధమైంది. ‘సర్కార్ లైవ్‘ వచ్చిన ” 3 వ డివిజన్ లో భూ భాగోతం” ,”కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి”, “కలెక్టర్ మేడం ప్రభుత్వ రోడ్డును రక్షించండి”అనే కథనాలపై స్పందించిన జిల్లా కలెక్టర్ సత్య శారద , ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు సమాచారం

​అసలేం జరిగింది?

​పైడిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 704లో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ నుండి కొత్తపేట వెళ్లే మార్గంలో ఉన్న ప్రభుత్వ పానాదిని (రోడ్డు) కొంతమంది రియల్టర్ లు నిబంధనలకు విరుద్ధంగా తమ వెంచర్‌లో కలిపేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలను మ్యాపులు, ఆధారాలతో సహా ‘సర్కార్ లైవ్’ బట్టబయలు చేయడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది.

paidipalli News

​క్షేత్రస్థాయిలో విచారణ, సర్వే చేపట్టిన అధికారులు

జిల్లా ​కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రెవెన్యూ యంత్రాంగం మరియు సర్వేయర్లు వివాదాస్పద స్థలాన్ని సందర్శించి పక్కాగా సర్వే నిర్వహించారు.సర్వే నంబర్ 704లోని రికార్డులను, ఎఫ్.టి.ఎల్ (FTL) బౌండరీలను క్షుణ్ణంగా పరిశీలించారు.రికార్డుల్లో ఉన్న ప్రభుత్వ రోడ్డు విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వెంచర్ ఆక్రమణలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించి మార్కింగ్ చేసినట్లు తెలుస్తోంది. వెంచర్ అనుమతులపై ఆరా తీసిన అధికారులు, దీనిపై పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నారు.
​”ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. ప్రభుత్వ భూములు, రోడ్ల ఆక్రమణలను ఏమాత్రం సహించేది లేదు. సర్వే నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వెంచర్ లోపల ఉన్న ​ప్రభుత్వ రోడ్డును కాపాడేందుకు వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్ సత్య శారద కు ఈ సందర్భంగా స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వాస్తవాలను వెలికితీసిన “సర్కార్ లైవ్” కు అభినందనలు తెలియజేశారు.త్వరలోనే వెంచర్ లోని ఆక్రమిత రోడ్డును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?