డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. ఇకపై పీడీ యాక్ట్ అమలు!
Drugs Control Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గురువారం తొలిసారిగా 'ఈగల్ ఫోర్స్' , పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే నిందితులపై పీడీ యాక్ట్ తరహా కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. కేవలం అరెస్టులతోనే సరిపెట్టకుండా, డ్రగ్స్ సరఫరాదారుల ఆస్తులను కూడా సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
ముఖ్యంగా విద్యాసంస్థల విషయంలో డీజీపీ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై పాఠశాలలు, కాలేజీలు లేదా యూనివర్సిటీ ప్రాంగణాల్లో డ్రగ్స్ దొరికితే, దానికి పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. డ్రగ్స్ సరఫరాతో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాలపై కూడా తాము ప...

