Skip to main content

Sarkar Live

Day: May 13, 2026

గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి: ప్రయాణికుల డిమాండ్
State

గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి: ప్రయాణికుల డిమాండ్

వరంగల్ నగరంలోని కీలక ప్రాంతమైన గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఈ జంక్షన్ నుండి రాకపోకలు సాగిస్తుండగా, కనీసం నిలబడటానికి నీడ లేక నానా అవస్థలు పడుతున్నారు. ​ప్రయాణికుల ప్రధాన సమస్యలు.. సరైన షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు మండుతున్న ఎండలో, వర్షంలో రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పాఠశాల విద్యార్థులు గంటల తరబడి నిలబడలేక ఇబ్బంది పడుతున్నారు. బస్ స్టాప్ నిర్దేశిత ప్రాంతంలో షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మీదకు వచ్చి నిలబడుతున్నారు. దీనివల్ల అటుగా వచ్చే వాహనదారులకు ఆటంకం కలగడమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వెలుతురు, కూర్చునే సదుపాయం లేక మహిళా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ​ఆర్టీస...
error: Content is protected !!