పూనకాలు తెప్పిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్: ‘రగ్గడ్’ ఊరమాస్ లుక్‌లో రామ్ చరణ్.. – Peddi Movie Trailer
Ram Charan Peddi Movie Trailer | టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్ర ట్రైలర్ ఎట్టకేలకు విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. రిలీజైన క్షణం నుంచే ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతూ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. రెండు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం, రెండుసార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్
ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో చిత్ర బృందం ఘనంగా విడుదల చేసింది. ఇందుకోసం ‘పెద్ది’ టీమ్ ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ముంబైకి విమానంలో వెళ్ళింది. 3 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్, ఈ కథాంశం ఎలా ఉండబోతోందనే దానిపై ప్రేక్షకులకు ఒక స్పష్టమైన సూచన ఇచ్చ...

