ఇంటి స్థలం గొడవ: అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం
ఇంటి స్థలం కొలతల విషయంలో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానలా మారి, ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నానికి దారితీసిన ఘటన గీసుగొండ మండల పరిధిలోని దస్రు నాయక్ తండా (మంగళ తండా) లో చోటుచేసుకుంది. గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అప్పుల బాధతో స్థలం విక్రయం..
మంగళ తండాకు చెందిన కేలోతు కవిత, ఆమె భర్త శ్రీధర్ అప్పుల బాధలు తాళలేక తమకు ఉన్న ఇల్లు, ఇంటి స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కవిత ఆడబిడ్డ అయిన గూగులోతు విజయ (భువనగిరి), మరియు జరుపుల మంగమ్మ (మంగళ తండా) లు ఆ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 24వ తేదీన గ్రామ పెద్దల సమక్షంలో ఒక గుంట స్థలానికి రూ. 2,60,000 చొప్పున ధర నిర్ణయించుకుని, లక్ష రూపాయలను అడ్వాన్స్‌గా కూడా చెల్లించారు.
కొలతల వేళ వివాదం – చెప్పులతో దాడి..
మరుసటి రోజు (మే 25న)...


