Atul Subhash suicide case : గృహ హింసకు గురై ఆత్మహత్య చేసుకున్న అతుల్ సుభాష్ (34) కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అతడి అత్త నిషా సంఘానియా, బావమరిది అనురాగ్ సంఘానియాను కర్ణాటక పోలీసులు శక్రవారం అరెస్టు చేశారు. అతుల్ భార్య పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.
వేధింపులు తట్టుకోలేక…
అతుల్ ఆత్మహత్య ప్రపంచమంతా చర్చనీయాంశమైంది. వివాహిత పురుషులు కూడా గృహ హింసకు గురువుతున్నారనే విషయాన్ని ఎత్తి చూపింది. తన భార్య, ఆమె కుటుంబం తనను డబ్బుల కోసం వేధిస్తున్నారని, రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అతుల్ సుభాష్ డిసెంబర్ 9న ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు 40 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాశాడు. దీంతోపాటు 90 నిమిషాల వీడియా ద్వారా తన భార్య నిఖిత సింఘానియా, ఆమె కుటుంబం తనను ఎలా వేధించారో వివరించాడు.
నా అస్తికలు కాలువలో కలపండి
అతుల్ తన సూసైడ్ నోట్‌లో వెల్లడించిన ఘోర నిజాల వివరించడంతో పాటు తన చివరి కోరికను వెల్లడించాడు. ’నా వేధింపులకారులను నేరస్థులుగా తేల్చకపోతే నా అస్తికలను కోర్టు బయట కాలువలో పోయాలి. నా వేధింపులకారులు శిక్ష పొందే వరకు నా అస్తికల విసర్జన చేయకండి.’ అని పేర్కొన్నాడు. నా ఆత్మహత్య విషయాన్ని వివిధ మాధ్యమాల్లో ప్రసారం చేయాలని కోరాడు.
రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు మెయిల్
తన ఆత్మహత్య కేసులో నిందితులైన తన భార్య, ఆమె కుటుంబాన్ని అరెస్టు చేయాలని అతుల్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అప్పుడే తన ఆత్మశాంతిస్తుందని తెలిపాడు. తనలా ఏ పురుషుడూ గృహ హింసకు గురికావద్దని ఆకాంక్షించాడు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి తనలాంటి భర్తలకు న్యాయం చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, సుప్రీం కోర్టుకు మెయిల్ పంపాడు.
ఎలాన్ మస్క్, ట్రంప్
అతుల్ తన ఆవేదనను వెల్లడిస్తూ రాసిన నోట్‌ను ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్‌కు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో ఒక లింక్ షేర్ చేశాడు. “ఇప్పుడు నేను లేనప్పుడు మీరు దీన్ని చదువుతారు. న్యాయపరమైన విధానాల కారణంగా భారతదేశంలో పురుషుల జీవితాలు నాశనమవుతున్నాయని తెలుసుకుంటారు ” అని పేర్కొన్నాడు.
నీ జీవితం నాశనం కావద్దు నాన్నా..
అతుల్ తన రెండేళ్ల కుమారుడిని ఉద్దేశించి తన సూసూడ్ నోట్‌లో నేనే లేనప్పుడు నీ అమ్మకు గానీ, ఆమె కుటుంబానికి గానీ దోచుకునేందుకు డబ్బు ఉండదు. నీవు నిజాలను తెలుసుకునే రోజుకు ఎదురుచూస్తాను. నీ తల్లి, ఆమె స్వార్థపరుల కుటుంబం ఎలా ఉంటుందో అప్పుడు తెలుసుకుంటావు. నీ జీవితాన్ని వారు నాశనం చేయొద్దని దేవుడిని కోరుకుంటున్నాను. కాగా అతుల్ ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దేశ విదేశాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరు అరెస్టు, ఒకరి పరారీ
Atul Subhash suicide case అతుల్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు బెంగళూరులో మారతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో అతడి భార్య, ఆమె కుటుంబ సభ్యులపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి పురోగతిని సాధించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అతుల్ అత్త నిషా సింఘానియా, బావమరిది అనురాగ్ సింఘానియాను ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. నిఖిత సింఘానియా పరారీలో ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..