Hanamkonda | సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కలను (Ganja Plants) పెంచాడు తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టిన సదరు వ్యక్తిని యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట ప్రాంతంలో నివాసం ఉండే అట్ల వెంకట నర్సయ్య (72), వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే మరింత సులభంగా డబ్బు సంపాదించాలని ఓ ఐడియా వేసుకున్నాడు.
ఇందుకోసం వెంకటనర్సయ్య తన ఇంటి పెరట్లో ఐదు అడుగుల విస్తీర్ణంలో గంజాయి మొక్కల పెంపకం చేపట్టి వాటిలో కొన్ని మొక్కలను ఎండబెట్టి విక్రయించేందుకు సిద్దమయ్యాడు. అయితే.. యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం కు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు గంజాయి పెంచుతున్న ఇంటిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ బృందంతో తనిఖీలు చేపట్టగా ఇంటి పెరట్లో గంజాయి మొక్కను గుర్తించారు.గంజాయి మొక్కలను పెంచుతున్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని సుబేదారి పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీల్లో ఆర్ఎస్ఐలు పూర్ణ, మనోజ్, నాగరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Ganja | ఇంటి పెరట్లో గంజాయి.. అరెస్టు చేసిన పోలీసులు”