ITC Share Price : ఐటీసీ హోటల్స్ (ITC Hotels business ) షేర్స్ ఈ రోజు ఎక్స్-హోటల్స్‌గా ట్రేడవుతున్నాయి. ఐటీసీ హోటల్స్ షేర్ కోసం ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ NSE, BSE స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో జరిగింది. ఇందులో ఐటీసీ హోటల్స్ స్టాక్ ధర నిర్ణయించబడింది. సెషన్ ముగిసే నాటికి NSE వద్ద ఐటీసీ షేర్లు రూ. 455.60 వద్ద ట్రేడయ్యాయి. అంటే.. 5.4 శాతం (రూ. 26) తగ్గింపు అన్నమాట. అలాగే BSE వద్ద రూ. 455 వద్ద ముగిసాయి. అంటే 5.6% (రూ. 27) తగ్గింపు జరిగింది.
షేర్ల వివరాలు
ఐటీసీ హోటల్స్ షేర్స్ (Share ) రేషియో 1:10 గా ఉంది. అంటే. ఐటీసీ షేర్ల ప్రతి 10కు ఐటీసీ హోటల్స్‌లో ఒక షేర్ లభిస్తుంది. దీంతో ఐటీసీ హోటల్స్ మౌలికంగా ప్రత్యేక కంపెనీగా మారుతుంది. దీనికి సెపరేట్‌గా లిస్ట్ చేయబడుతుంది. అయితే, లిస్టింగ్ తేదీ ఇంకా తెలియజేయలేదు.
ITC హోటల్స్ వ్యాపారం
ఐటీసీ హోటల్స్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద హోటల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. 2024 అక్టోబరు నాటికి కంపెనీకి 140 హోటల్స్, 13,000 రూమ్‌లు (ఆపరేటింగ్ కీస్) ఉన్నాయి. 2030 నాటికి 200+ హోటల్స్, 18,000 కీస్ లక్ష్యంగా ఈ కంపెనీ పనిచేస్తోంది. ఈ హోటల్స్‌లో 35% కంపెనీకి సొంతమైనవి, మిగతావి మేనేజ్‌మెంట్ లేదా ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా నడుస్తున్నాయి.
FY24 లో కంపెనీ రూమ్ రెవెన్యూ (RevPAR) 18% పెరిగింది. అలాగే ఆక్యుపెన్సీ 69% ఉంది. కంపెనీకి మంచి రిటర్న్ రేషియోలు ఉన్నాయి. ముఖ్యంగా RoCE 20% దగ్గర ఉంది. ఈ కంపెనీకి ఎలాంటి అప్పులు లేవని తెలుస్తోంది. ఇది భవిష్యత్ వ్యాపార అభివృద్ధికి బలం చేకూరుస్తోంది.
ITC కొత్త కొనుగోళ్లు
ఐటీసీ తన అనుబంధ సంస్థ రస్సెల్ క్రెడిట్ ద్వారా EIH (ఓబెరాయ్ హోటల్స్) లో 2.44% వాటా, HLV (ది లీలా) లో 0.53% వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు ITC, EIHలో 16.13% , HLVలో 8.11% వాటా కలిగి ఉంది. ఈ కొనుగోళ్లు ITC హాస్పిటాలిటీ రంగంలో వాటాను మరింత బలోపేతం చేస్తాయి.
MSCI ఇండెక్స్‌లో ITC హోటల్స్
MSCI గ్లోబల్ చిన్న కాపిటల్ ఇండెక్స్‌లో ఐటీసీ హోటల్స్ చేర్చబడుతుందని అంచనా. విభజన రోజున ఐటీసీ హోటల్స్ స్టాక్ లైవ్ ట్రేడింగ్ చేయకపోవడం వల్ల తాత్కాలికంగా స్థిర ధరకు సూచీలో చేర్చబడుతుంది. ఐటీసీహోటల్స్ ట్రేడింగ్ మొదలయ్యాక మార్కెట్ ధరకు అనుగుణంగా సూచీలో మార్పులు జరుగుతాయి.
షేర్లకు అంచనా ధర
బ్రోకరేజ్ సంస్థలు ఐటీసీ హోటల్స్ షేర్ల ప్రారంభ ధరను ₹100-₹125 మధ్య అంచనా వేస్తున్నాయి. SBI సెక్యూరిటీస్ ప్రకారం ఇది హోటల్ రంగంలో సహజమైన ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూషన్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
ITC హోటల్స్ గ్రోత్‌కు అవకాశం
Centrum Broking నివేదిక ప్రకారం 2027 నాటికి ITC హోటల్స్ ఆదాయం ₹4570 కోట్లకు చేరవచ్చు. EBITDA మార్జిన్ 35% వరకు పెరుగుతుందని అంచనా. స్థానిక హాస్పిటాలిటీ రంగంలో వృద్ధి, గ్లోబల్ టూరిజం బూస్ట్ కారణంగా ఐటీసీ హోటల్స్ పొటెన్షియల్ మరింత మెరుగ్గా ఉండనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “ITC : ఐటీసీ హోటల్స్ షేర్స్.. బిగ్ అప్‌డేట్స్”