చైనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. క్రమేణా విస్తరిస్తోంది. బెంగళూరులో మానవ మెటాప్న్యుమో వైరస్ (HMPV) రెండు కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో హెచ్ఎంపివి వైరస్ మొదటి కేసులు ఇవే. ఎనిమిది, మూడు నెలల ఇద్దరు శుశువులు దీని బారిన పడ్డారు. ఎనిమిది నెలల శిశువు చికిత్స పొందుతుండగా, మూడు నెలల శిశువును ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
వేగంగా వ్యప్తి చెందుతున్న వైరస్
ప్రస్తుతం చైనాలోహెచ్ఎంపివి వైరస్వ్యాప్తి విపరీతంగా ఉంది. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇన్‌ఫ్లూయెంజా A, HMPV, మైకోప్లాజ్మా న్యూమోనియా, కొవిడ్-19 వంటి అనేక వైరస్‌లు చైనాలో వ్యాప్తి చెందుతున్నాయి. శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న అక్కడి బాధితుల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
HMPV అంటే ఏమిటి?
HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్. ఇది మొదట 2001లోనే వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. దీని బారిన పడిన వారిలోఓ సాధారణంగా జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ వైరస్ ప్రబలుతుంది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతోపాటు వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.
HMPV సాధారణ లక్షణాలు
- దగ్గు
- జ్వరం
- ముక్కు కారడం (నాజల్ కాంగెషన్)
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- గొంతు నొప్పి
ఈ లక్షణాలు సాధారణంగా వైరస్ బారిన పడిన 3-6 రోజుల తర్వాత కనిపిస్తాయి. ఈ వైరస్‌తో తీవ్రమైన అనారోగ్యం కలిగే అవకాశం కూడా ఉంది. ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థి కూడా రావచ్చు.
వ్యాప్తి ఎలా జరుగుతుంది?
హెచ్ఎంపివి వైరస్ బారిన పడిన వ్యక్తితో నేరుగా సంబంధం కలిగి ఉండట ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.
వైరస్ కలిగిన ఉపరితలాలను తాకడం, దగ్గు లేదా తుమ్ము ద్వారా, చేతులు కలపడం వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు తీవ్రతరమైతే విపరీత దగ్గు, వీపింగ్, శ్వాస సమస్యలు ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
HMPV చికిత్స.. వ్యాక్సిన్
ప్రస్తుతం హెచ్ఎంపివి వైరస్ కోసం ఎలాంటి టీకా అందుబాటులో లేదు. హెచ్ఎంపివి వైరస్ చికిత్స ప్రధానంగా లక్షణాలను తగ్గించడంపైనే ఆధారపడి ఉంటుంది. జ్వరం తగ్గించడానికి మందులు, శ్వాస సౌకర్యం కోసం ఆక్సిజన్ చికిత్స, శరీర హైడ్రేషన్ కాపాడటం ద్వారానే దీని నుంచి ఉపశమనం కలుగుతుంది.
నివారణ కోసం చిట్కాలు
- కనీసం 20 సెకండ్ల పాటు చేతులు సబ్బుతో కడగాలి. లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ వాడాలి.
- దగ్గు లేదా తుమ్ము చేస్తున్నప్పుడు ముక్కు, నోటికి అడ్డంగా కర్చీఫ్ పెట్టుకోండి.
- మాస్క్ ధరించడం మంచిది.
- అనుమానిత అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సంబంధం కలిగి ఉండకండి.
-శుభ్రమైన చేతులతోనే కళ్లను, ముక్కును, నోటిని తాకండి. - మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులతో సంబంధం లేకుండా స్వీయ నిర్బంధం (సెల్ఫ్ ఐసోలేషన్) పాటించండి.
అవగాహన అవసరం
HMPV చాలా సందర్భాల్లో సాధారణ జలుబు కంటే తీవ్రమైంది కాదు. కానీ, కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన శ్వాస సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “HMPV : చైనా వైరస్ విజృంభణ.. ఇండియాలో కేసులు నమోదు”