Sarkar Live

పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా.. జాగ్ర‌త్త‌!

Govt cautions : పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ప‌ట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్ లాంటివి వీటి ద్వారా చెయ్యొద్దని సూచిస్తోంది. డిజిటల్ భద్రతను మరింత బలపర్చడంలో భాగంగా ప్రజలకు హెచ్చరికలు

Wi-Fi

Govt cautions : పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ప‌ట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్ లాంటివి వీటి ద్వారా చెయ్యొద్దని సూచిస్తోంది. డిజిటల్ భద్రతను మరింత బలపర్చడంలో భాగంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, కాఫీషాపులు, మాల్స్ వంటి ప్రదేశాల్లో ఉచిత Wi-Fi కనెక్ట్ కావ‌డం చాలామందికి పరిపాటి అయిపోయింది. అయితే ఇలాంటి నెట్‌వర్క్స్ లో భద్రతా పరిరక్షణ స‌రిగా ఉండ‌ద‌ని, ఎన్‌క్రిప్షన్ సరిగా ఉండదని, హ్యాకర్లు సులభంగా మీ పర్సనల్ డేటాను త‌స్క‌రిస్తార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ చేస్తోంది. ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం (Indian Computer Emergency Response Team (CERT-In) ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న జాగృత దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ఈ మేర‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  

CERT-In అంటే ఏమిటి?

CERT-In అంటే Indian Computer Emergency Response Team. ఇది భారతదేశం మొత్తానికి సైబర్ భద్రతను సమన్వయం చేస్తుంది. కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (Ministry of Electronics and Information Technology-MeitY) పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఇది సైబర్ దాడులపై స్పందిస్తుంది. ప‌లు సంద‌ర్భాల్లో హెచ్చ‌రిక‌లు జారీ చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు మార్గదర్శకత్వం చేస్తుంది.

పబ్లిక్ Wi-Fi – Govt cautions : ఏమేం చేయొద్దంటే..

  • – పబ్లిక్ Wi-Fi వాడుతూ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు చేయొద్దు.
  • – ఆన్‌లైన్ షాపింగ్, పేమెంట్ ట్రాన్స్‌ఫర్ లాంటివి ఫ్రీ నెట్‌వర్క్స్‌పై చేయ‌డం ప్రమాదకరం.
  • – ఈమెయిల్స్ చెక్ చేయడం, సోషల్ మీడియా లాగిన్ లాంటివి కూడా జాగ్రత్తగా చేయాలి.
  • పబ్లిక్ Wi-Fi ఉపయోగిస్తే ఎదురయ్యే ప్రమాదాలు
  • – డేటా దొంగతనం: మీ పాస్‌వ‌ర్డ్స్‌, బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ లాంటివి హ్యాకర్లు దొంగలించగలరు.  
  • – ఆర్థిక నష్టం: అకౌంట్లోంచి డబ్బు డ్రా చేయటం, మీ అకౌంట్ నుంచే మీకు తెలియకుండా ఇత‌ర అకౌంట్‌కు ట్రాన్సక్ష‌న్ జ‌రగొచ్చు.
  • – ఐడెంటిటీ థెఫ్ట్: మీ పేరుతో క్రిమినల్ కార్యకలాపాలు జరగొచ్చు.  
  • – సిస్టమ్ హ్యాకింగ్: మీ ఫోన్, ల్యాప్‌టాప్ లోకి వైరస్‌లు, మాల్వేర్‌లను పంపొచ్చు.
  • – ఒక్క చిన్న పొరపాటు జీవితాంతం బాధ కలిగించే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
  •  ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు
  • CERT-In కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలు ఇచ్చింది:
  •  – పబ్లిక్ Wi-Fi పై సున్నితమైన సమాచారం ఇవ్వొద్దు. బ్యాంకింగ్, పేమెంట్స్ చేయకుండా ఉండండి.  
  • – వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) వాడండి. ఇది మీ కనెక్షన్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది.  
  • – పబ్లిక్ Wi-Fi వాడేటప్పుడు AutoFill ఆపండి. బ్రౌజర్‌లో సేవ్ అయిన పాస్‌వ‌ర్డ్‌ను ఉపయోగించొద్దు.  
  • – అజ్ఞాత లింక్స్ క్లిక్ చేయొద్దు. ఫిషింగ్ లింక్స్ ద్వారా మాల్వేర్ వస్తుంది.  
  • – బలమైన పాస్వర్డ్స్ వాడండి. అక్షరాలు, అంకెల మిశ్రమం ఉన్న పొడవైన పాస్‌వ‌ర్డ్‌ను క్రియేట్ చేయండి.  
  • – డేటా రెగ్యులర్‌గా బ్యాకప్ చేయండి. ఏదైనా జరిగితే మీ ఫైల్స్‌ను రికవర్ చేసుకోవచ్చు.
  • – సాధ్యమైనంతవరకూ మొబైల్ డేటా వాడండి.  
  • – అత్యవసరమైతే మాత్రమే ఫ్రీ Wi-Fi వాడండి. అది కూడా బ్యాంకింగ్ లావాదేవీల కోసం కాదు.  
  • – VPN లేకుండా ప్రైవేట్ అకౌంట్స్‌లో లాగిన్ అవ్వొద్దు.  
  • – ఎప్పుడూ HTTPS వెబ్‌సైట్లు మాత్రమే ఓపెన్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?