సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీతో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh)బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మంచి జోరు మీద ఉన్నాడు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సీనియర్ హీరోల్లో 300 కోట్ల క్లబ్బులో చేరి హిస్టరీ క్రియేట్ చేశాడు. అదే జోష్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)సినిమాకు రెడీ అవుతున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కబోయే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి వర్క్ చేసి సూపర్ రైటర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఈ సారి మెగా ఫోన్ తో వెంకీ కి బ్లాక్ బస్టర్ హిట్టు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు.
యమ స్పీడ్ గా మూవీస్ ను లైన్లో పెడుతున్న వెంకీ త్రివిక్రమ్ మూవీని అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా తానా సభలకు హాజరై తన నెక్స్ట్ మూవీస్ పై కూడా అప్డేట్ ఇచ్చారు. అనిల్ రావిపూడి చిరు(Anil ravipudi chiru combo)కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ను అలరిస్తాయని తెలుస్తోంది.
దృశ్యం 3 లో కూడా వెంకీ నే…
చిరు, వెంకీ కామెడీ ఎలా పండిస్తారో మనకు తెలిసిందే. థియేటర్లు ఫ్యాన్స్ అరుపులకు దద్ధరిల్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే షెడ్యూల్ లో మూవీ టీం తో వెంకీ జాయిన్ అవ్వబోతున్నారు. అలాగే జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో మీనా హీరోయిన్ గా దృశ్యం 3(drushyam 3)లో కూడా యాక్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దృశ్యం, దృశ్యం 2 లో వెంకీ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. జీతూ జోసెఫ్ దృశ్యం 3 అనౌన్స్ చేసినప్పటి నుండి తెలుగులో వెంకీ యాక్ట్ చేయాలని ఆడియన్స్ బలంగా కోరుకున్నారు.ఇప్పుడు వెంకీ ఆ మూవీలో నటిస్తున్నట్టు స్వయంగా ఆయనే అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ లో…
ఇదిలా ఉండగా నందమూరి నటసింహం బాలకృష్ణ తో కూడా Venkatesh మూవీ చేస్తున్నట్టు చెప్పి ఆడియన్స్ ను థ్రిల్ చేశాడు. ఈ మూవీ ఎవరి డైరెక్షన్ లో వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాల తర్వాత సంక్రాంతి కి వస్తున్నాం(sankrathiki vasthunnam)సీక్వెల్ ఉంటుందని చెప్పారు. ఈ మూవీ సక్సెస్ మీట్ రోజునే సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుస క్రేజీ కాంబినేషన్ లో మూవీస్ తీస్తూ వెంకీ బిజీ బిజీగా మారిపోయారు. ఒకవైపు సోలో హీరోగా,మరోవైపు వేరే హీరోల సినిమాలలో గెస్ట్ రోల్ చేస్తుండడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.