Jatadhara Release Date : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు బావగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. SMS, శివ మనసులో శృతి సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, మారుతి దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రంతో భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత సమ్మోహనం, భలే మంచి రోజు వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అయితే గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత, భారీ మైథలాజికల్ జానర్ మూవీ జటాధరతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ విడుదల చేసిన పోస్టర్, తర్వాత విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీనితో సినిమా మీద హైప్ మరింత పెరిగింది.
Jatadhara రిలీజ్ డేట్ ఖరారు
మూవీ మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జటాధర మూవీని నవంబర్ 7న గ్రాండ్‌గా తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ తేదీన పెద్ద సినిమాలు రానందున, ఇది జటాధర టీంకు అదనపు బూస్ట్‌గా మారనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాష్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మైథలాజికల్ మూవీస్‌కి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉండటంతో, సుధీర్ బాబు ఈ సినిమాతో పెద్ద హిట్టు కొట్టాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో ముందుకు వస్తున్నారు. నవంబర్ 7న జటాధర రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా సుధీర్ బాబుకు భారీ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








