Constitution Day | భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనిక దేశానికి దిక్సూచి అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ దినోత్సం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 26, 1949న, రాజ్యాంగాన్ని ఆమోదించాలనే నిర్ణయం.. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మార్చిందని గుర్తుచేశారు. సంవిధాన్ దివస్ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను గుర్తుంచుకోవడం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడంపై దృష్టిసారించాలన్నారు. మహనీయుల ఆకాంక్షలను సాకారం చేసేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
Also Read : Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..
దేశ ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “భారత రాజ్యాంగ దినోత్సవ” శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గనిర్ధేశనంలో అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలనే తమ ప్రజా ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ చెప్పారు.
949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయంతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పరిఢవిల్లుతోందన్నారు. దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన రాజ్యాంగ నిర్మాతలను సంవిధాన్ దివస్ రోజున స్మరించుకోవడమే కాకుండా రాజ్యాంగ విలువలు కాపాడుతూ ఆ మహాశయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
🇮🇳ప్రతినిత్యం మన హక్కులు, బాధ్యతలను గుర్తుచేస్తూ అందరికీ సమానావకాశాలతో ప్రగతిపథంలో బాటలు వేయడానికి నిత్యస్ఫూర్తిగా నిలిచే మూలస్తంభం మన రాజ్యాంగం అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
1 Comment
[…] లేని వారిని ఎంపిక చేసి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. భవిష్యత్తులో […]