BC Bandh Hyderabad | తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం నుంచి మరో తరం పొలిటికల్ ఎంట్రీ ఇస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తాజాగా బీసీ బంద్కు మద్దతు తెలుపుతూ రంగంలోకి దిగారు.
ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత ధర్నా చేశారు. అయితే, ఈ ధర్నాలో ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తల్లితోపాటు రోడ్డుపై బైఠాయించి బీసీ రిజర్వేషన్ల కోసం నినాదాలు చేశారు. ఆదిత్య తన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగు వేసినట్లు పలువురు భావిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఆ పిలుపునకు మద్దతుగా కవిత సైతం ఉద్యమంలో పాల్గొని, బీసీ హక్కుల కోసం తన సమరభేరి మోగించారు. అదే సమయంలో కవిత కుమారుడు కూడా నిరసనలో పాల్గొనడం ఆసక్తికర పరిణామంగా మారింది. దీంతో, కవిత కుమారుడు ఆదిత్య ఇప్పుడు రాజకీయంగా రంగప్రవేశం చేశారా? అనే చర్చ తాజాగా ఊపందుకుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల కుమారుడు రాజకీయ ప్రవేశానికి సన్నాహాలు జరుగుతుండగా, ఇప్పుడు కవిత కుమారుడు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్రానే అభిప్రాయం వినిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కవిత పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    