Allu Arjun | టాలివుడ్ నటుడు అల్లు అర్జున్ ను అరెస్టయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ సందర్శించిన సమయంలో తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో. రేవతి కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయాలయ్యాయి.
కాగా మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనలో పోలీసులు గతంలోనే ఇటీవలే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.సెక్యూరిటీగార్డ్ సహా థియేటర్ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
మృతురాలి కుటంబానికి రూ.25 లక్షలు సాయం..
కాగా రేవతి మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ప్రకటించాడు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నారు. .కాగా చికడపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ ఇప్పటికే థియేటర్ ప్రతినిధులు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత అల్లుఅర్జున్ కూడా పిటిషన్ వేశారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లకు నటులు వెళ్తుంటారని, ఇది సహజంగా జరిగేదేనని ఆయన పేర్కొన్నారు.
గతంలో కూడా తాను పలుమార్లు సినిమా ప్రదర్శనల సమయంలో వెళ్లానని.. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని అల్లు అర్జున్. తెలిపారు. స్థానిక పోలీసు అధికారులకు భద్రత కోసం ముందస్తుగా సమాచారం ఇచ్చామని.. ఇందులో తమ నిర్లక్ష్యం ఏదీ లేనది అల్లు అర్జున్ తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 thoughts on “Allu Arjun | అల్లు అర్జున్ అరెస్ట్”