Sarkar Live

Author: Maulika

Kaleshwaram Project కేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ విచార‌ణ ప్రారంభం
State

Kaleshwaram Project కేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ విచార‌ణ ప్రారంభం

Kaleshwaram Project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రాథ‌మిక విచార‌ణ (Preliminary Enquiry)ను ప్రారంభించింది. ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముందడుగు వేసింది. ఈ విష‌యాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అనేక అవకతవకలపై సీబీఐ ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు చేపట్టనుంది. ప్రాథమిక విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు, చెల్లింపుల వివరాలు, కాంట్రాక్టర్ కంపెనీల రికార్డులు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను పరిశీలించనుంది. ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సమర్పించిన నివేదిక ఈ విచారణకు కీలక ఆధారంగా మారనుంది. ఇంజినీరింగ్ లోపాలు, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు, నిర్మాణంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలు వంటి అనేక అంశాలను ఆ ని...
Man murdered | రీహాబిలిటేషన్ సెంటర్‌లో దారుణం.. సహచరుల దాడిలో ఒక‌రి హ‌తం
Crime

Man murdered | రీహాబిలిటేషన్ సెంటర్‌లో దారుణం.. సహచరుల దాడిలో ఒక‌రి హ‌తం

Miyapur Murder Case : హైదరాబాద్ మియాపూర్ (Miyapur) ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్ (rehabilitation centre )లో ఘోర ఘటన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని అదే సెంటర్‌లోని ఇద్దరు సహచరుల చేతిలో హ‌త్య‌కు గురైన‌ట్టు వెలుగులోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు చెందిన సందీప్ మాదక ద్రవ్యాలకు అల‌వాటు ప‌డి (addicted to drug) వ్య‌స‌న‌పరుడిగా మారాడు. దీంతో అత‌డిని కుటుంబ సభ్యులు సుమారు తొమ్మిది నెలల క్రితం హైద‌రాబాద్‌లోని రీహాబిలిటేష‌న్ సెంటర్‌లో చేర్పించారు. మాదక ద్ర‌వాల‌ను వీడి అత‌డు సాధార‌ణ జీవితాన్ని గడుపుతాడ‌ని భావించారు. ఇదే క్ర‌మంలో న‌ల్ల‌గొండ జిల్లా (Nalgonda district)కు చెందిన ఆదిల్‌, హైద‌రాబాద్ బార్క‌స్‌కు చెందిన సులేమాన్ కూడా మూడు నెల‌ల క్రితం ఈ రీహాబిలేష‌న్ సెంట‌ర్‌లో చికిత్స కోసం చేరారు. బుధ‌వారం రాత్రి సందీప్‌తో ఆదిల్‌, సులేమ...
Railway News | ముంబై–కరీంనగర్ రైలు పునఃప్రారంభం
State, Karimnagar

Railway News | ముంబై–కరీంనగర్ రైలు పునఃప్రారంభం

Indian Railway News : కరోనా మహమ్మారి సమయంలో నిలిచిపోయిన అనేక రైలు సేవలలో ముఖ్యమైనది ముంబై–కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ ఒక‌టి. ఇప్పుడు ఆ రైలు మళ్లీ పట్టాలెక్కింది. దీని పునఃప్రారంభంతో రెండు నగరాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. ఉద్యోగులు, వ్యాపార‌వేత్త‌లు, విద్యార్థులు అందరికీ ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. క‌రోనా తర్వాత రైలు మళ్లీ ప్రారంభం కరోనా (COVID-19) కాలంలో విధించిన పరిమితుల కారణంగా అనేక రైళ్లు నిలిచిపోయాయి. వాటిలో ముంబై - కరీంనగర్ వెళ్లే ఈ రైలు కూడా ఒకటి. ఈ సర్వీస్ నిలిచిపోవడంతో రెండు నగరాల మధ్య రాకపోకలు కష్టంగా మారాయి. ప్రయాణికుల (passengers) నుంచి నిరంతరం వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న రైల్వే శాఖ చివరికి ఈ సర్వీస్‌ (Mumbai–Karimnagar)ను మళ్లీ ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ముంబైలో ఉద్యోగాలు చేసే కరీంనగర్ ప్రాంత ప్ర...
ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు బిగ్ షాక్‌ – Betting racket
Crime

ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు బిగ్ షాక్‌ – Betting racket

CID cracks online Betting racket : చ‌ట్ట విరుద్ధ ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారం (online betting racket) పై తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (Telangana CID) మెరుపు దాడులు చేసింది. తెలంగాణ కేంద్రంగా న‌డుస్తున్న ఈ దందాపై ఉక్కుపాదం మోపింది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్న ఈ భారీ రాకెట్‌పై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఈ రాకెట్‌ వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఆరు యాప్‌ల ద్వారా కోట్ల వ్యాపారం సీఐడీ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితులు ప్రజలను మోసం చేయడానికి ప్రత్యేకంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను తయారు చేసి వాడుతున్నారు. Taj0077, Fairply.live, Andhra365, Vlbook, Telugu365, Yes365 అనే మొబైల్ యాప్‌ల ద్వారా వేలాది మందిని బెట్టింగ్ ఊబిలోకి దింపారు. తక్కువ ప...
BC Reservations : ‘స్థానిక’ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు.. త్వ‌ర‌లో జీవో
Special Stories

BC Reservations : ‘స్థానిక’ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు.. త్వ‌ర‌లో జీవో

BC Reservations : తెలంగాణ‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations ) కేటాయించేందుకు రంగం సిద్ధ‌మైంది. కొత్తగా జీవో జారీ (government order (GO) చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న‌ రెండు రోజుల్లోనే ఉత్త‌ర్వులు విడుదల కానున్నాయ‌ని అధికార వర్గాలు ధృవీకరించాయి. జిల్లా స్థాయిలో ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్లు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) ఏయే స్థానాలను రిజర్వ్ చేయాలనే క‌స‌ర‌త్తును పూర్తి చేశారు. మండల పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (MPTCs), జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (ZPTCs), మండల ప్రెసిడెంట్ (MPPs), సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల వరక...
error: Content is protected !!