Warangal | వరంగల్, నల్గొండలో ఇంక్యూబేషన్ సెంటర్స్
                    తెలంగాణను ఇన్నోవేషన్ హబ్‌గా మారుస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు
Warangal | త్వరలోనే వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University), నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలతో ఇంక్యుబేషన్ సెంటర్లను (Incubation Centers) ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar babu) వెల్లడించారు.
తెలంగాణను "ఇన్నోవేషన్ హబ్" గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్గొండలోనూ టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడుకలను శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… సైన్స్ కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ...                
                
             
								



