Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక కసరత్తు షురూ..
Young India Residential Schools | తెలంగాణలో యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పడనున్నాయి. ఇందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఈ పాఠశాలల నిర్మాణానికి సుమారు రూ.5 వేల కోట్లను సర్కార్ ఇప్పటికే కేటాయించింది. మొత్తం 100 అసెంబ్లీ నియోజకర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Residential Schools) ఏర్పాటవుతున్నాయి. ఒక్కోదానికి 20-25 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్కూల్స్ నిర్మాణానికి భూ సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) ఆదేశించారు. శుక్రవారం జరిగిన విద్యా సమీక్ష సమావేశంలో పలు అంశాలపై ఆయన సమీక్షించారు.
Young India Residential Schools లో ఎలాంటి సౌకర్యాలంటే..
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 4 నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాస...




