Sarkar Live

Author: Maulika

Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?
National

Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?

Revanth Reddy Chennai visit : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) ఈ రోజు సాయంత్రం చెన్నై పర్యటన (Chennai visit)కు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్ మ‌హేష్‌ గౌడ్ (Mahesh Goud) కూడా ఆయనతో పాటు వెళ్లనున్నారు. రేపు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu Chief Minister M.K. Stalin) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)) అంశంపై చర్చించనున్నారు. Revanth Reddy : కీల‌కాంశంగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ఒక కీల‌క‌ రాజకీయ అంశంగా మారింది. ఎన్నికల నియోజకవర్గాల పరిమాణాన్ని, భౌగోళిక పరిమితులను, ఓటర్ల విభజనను ఇది ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు రాజకీయ పార్టీల భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్వి...
Ashok Leyland | ఏపీలో మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌.. రానున్న‌ బ‌స్సుల తయారీ కేంద్రం
State

Ashok Leyland | ఏపీలో మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌.. రానున్న‌ బ‌స్సుల తయారీ కేంద్రం

Ashok Leyland : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మ‌రో భారీ పరిశ్రమ రాబోతోంది. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ ఆధునిక బస్సు తయారీ కేంద్రం (bus manufacturing plant) ఏర్పాటు కానుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత ముందుకు వెళ్లనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. నైపుణ్య అభివృద్ధికి ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధిలో మరో ముంద‌డుగు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక ప్రతిష్టాత్మక కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాన‌ని చెప్పారు. ఇప్పుడు అశోక్ లేలాండ్ వంటి పెద్ద సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమల అభివృద్ధికి మరో ముందడుగు అని ఆయన ...
Posani Krishna Murali | సీఐడీ క‌స్ట‌డీకి పోసాని.. ప‌లు కేసుల్లో విచార‌ణ‌
State

Posani Krishna Murali | సీఐడీ క‌స్ట‌డీకి పోసాని.. ప‌లు కేసుల్లో విచార‌ణ‌

Posani Krishna Murali : సినీ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) (ని ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఈ రోజు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ క‌ల్యాణ్ (Pawan Kalyan), ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ చేపట్టింది. పోసానిని జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చి గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్ప‌త్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయానికి తరలించారు. Posani Krishna Murali : అరెస్టు అయిన‌ప్ప‌టి నుంచి జైలులోనే.. గతవారం గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పోసానిని ఒకరోజు పోలీస్ కస్టడీలోకి అప్పగించింది. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్టు అయిన‌ప్ప‌టి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు....
Bhadradri | ఇంటి వ‌ద్ద‌కే భ‌ద్రాద్రి రాముడి త‌లంబ్రాలు.. ఆర్టీసీ ప్ర‌త్యేక సేవ‌లు
State

Bhadradri | ఇంటి వ‌ద్ద‌కే భ‌ద్రాద్రి రాముడి త‌లంబ్రాలు.. ఆర్టీసీ ప్ర‌త్యేక సేవ‌లు

Bhadradri Talambralu : భద్రాచలం శ్రీ సీతారామ కలాణోత్సవానికి (Sri Sitarama Kalyanotsavam) హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా శ్రీ రామనవమి (Sri Rama Namavi) సందర్భంగా లక్షలాది మంది భక్తులు భద్రాచలం (Bhadrachalam) చేరుకుని స్వామివారి కల్యాణోత్స‌వంలో పాల్గొని పవిత్ర తలంబ్రాల (Bhadradri Talambralu)ను స్వీకరించడం ఆనవాయితీ. అయితే.. ఈ మ‌హోత్స‌వానికి నేరుగా వెళ్ల‌లేని భ‌క్తుల కోసం తెలంగాణ రోడ్డు ర‌వాణా సంస్థ (TGSRTC) ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. స్వామి వారి త‌లంబ్రాల‌ను హోం డెల‌వ‌రీ చేసే సేవ‌ల‌ను అందిస్తోంది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌ గత సంవత్సరంలో ఈ సేవకు భక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. దీంతో దీన్ని ఏడాది మరింత విస్తృతంగా అందించేందుకు టీజీ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది. ఈసారి త‌లంబ్రాల (Bhadradri Talambralu) బుకింగ్ ప్రక్రియను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానంలో కూడ...
Megastar Chiranjeevi | చిరంజీవికి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు.. ప్ర‌క‌టించిన యూకే
Cinema

Megastar Chiranjeevi | చిరంజీవికి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు.. ప్ర‌క‌టించిన యూకే

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు ఆయ‌న చేస్తున్న సేవలకు, వ్య‌క్తిగ‌తంగా చేస్తున్న సామాజిక కార్య‌క్ర‌మాల‌కు గుర్తింపుగా యూకే ప్రభుత్వం (UK Government) ఆయ‌న్ను జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం (Lifetime Achievement Award)తో స‌త్క‌రించ‌నుంది. ఈనెల 19న యూకే పార్ల‌మెంట్‌లోని హౌస్ ఆఫ్ కామ‌న్స్ (House of Commons)లో చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా, సోజ‌న్ జోస‌ఫ్‌, బాబ్ బ్లాక్‌మ‌న్ స‌హా ప‌లువురు పార్ల‌మెంట్ స‌భ్యులు చిరంజీవిని ఈ మేర‌కు స‌త్క‌రించనున్నారు. Megastar Chiranjeevi : అంత‌ర్జాతీయ వేదిక‌పై అరుదైన గౌర‌వం బ్రిడ్జ్ ఇండియా అనే UKలోని ప్రముఖ సంస్థ చిరంజీవికి ఈ అవార్డును ప్ర‌క‌టించింది. “లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ ...
error: Content is protected !!