NTPC Recruitment 2025 | ఎన్‌టీపీసీలో భారీగా ఇంజనీరింగ్ ఉద్యోగాలు..
NTPC Recruitment 2025 : భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను విడుదలైంది. దీని ద్వారా మొత్తం 475 పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్-2024 స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది,. ఫిబ్రవరి 13, 2025 చివరి తేదీగా నిర్ణయించారు.
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 475 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
మెకానికల్ : 180 పోస్టులు
ఎలక్ట్రికల్ : 135 పోస్టులు
ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ : 85 పోస్టులు
సివిల్ విభాగం - 50 పోస్టులు
మైనింగ్ : 25 పోస్టులు
విద్యార్హత ...




