Sarkar Live

Author: Maulika

Prostitution racket | హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు
Crime

Prostitution racket | హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు

Prostitution racket : హైద‌రాబాద్‌లో ఓ అంతర్జాతీయ వ్య‌భిచార రాకెట్ (International prostitution racket)ను పోలీసులు గుట్టుర‌ట్టు చేశారు. గచ్చిబౌలి (Hyderabad’s Gachibowli)లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి వివిధ దేశాల‌కు చెందిన తొమ్మిది మంది మ‌హిళ‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముఖ్యంగా కెన్యా, టాంజానియాకు చెందిన మ‌హిళ‌లు ఉన్నారు. ప్ర‌త్యేక టీం దాడులు హైదరాబాద్ పోలీసు విభాగంలోని ప్రత్యేక ఆపరేషన్ టీం (SOT), స్థానిక పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో ఈ వ్య‌భిచారం కొన‌సాగుతోంద‌ని గుర్తించారు. ఈ రాకెట్ అంతర్జాతీయంగా విస్తరించి ఉందని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. విదేశాల నుంచి మ‌హిళ‌ల‌ను తీసుకొచ్చి ఈ దందాను న‌డిపిస్తున్నార‌ని తేలింది. ఈ ముఠా హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్త‌రించి ఉంద‌ని పోలీసులు అనుమానిస్తున్నార...
WhatsApp governance | ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.. వినూత్నంగా పౌర‌సేవ‌లు
State

WhatsApp governance | ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.. వినూత్నంగా పౌర‌సేవ‌లు

WhatsApp governance : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం అనేక వినూత్న విధానాలను తీసుకొస్తోంది. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp governance) అనే కొత్త పరిపాలనా విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పౌరసేవలను అత్యంత వేగంగా, పారదర్శకంగా అందించాల‌న్న‌దే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ (AP govt) ముఖ్యోద్దేశం. WhatsApp governance లో ఎన్ని సేవ‌లు? WhatsApp governance in AP : వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజలు 161 రకాల సేవలను పొందొచ్చు. దేవదాయ(Endowment Deportment), ఇంధనం, ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC), రెవెన్యూ, మునిసిపాలిటీ తదితర విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయి. పౌరులు తమ మొబైల్ ఫోన్ నుంచే తేలికగా సేవలను పొందేలా ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. ప్రభుత్వానికి నేరుగా సమస్యలను ద‌ర‌ఖాస్తులు, విజ్ఞాప‌ణ‌ల ద్వారా తెలియజేసే వీలుంటుంది. వాటిని అధికారులు...
Ram Gopal Varma | ఈసారైనా రావ‌య్యా.. ఆర్జీవీకి పోలీసుల మ‌రో నోటీసు
Cinema

Ram Gopal Varma | ఈసారైనా రావ‌య్యా.. ఆర్జీవీకి పోలీసుల మ‌రో నోటీసు

Hyderabad : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైన నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని పిలిచారు. అయితే.. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా వర్మ వివిధ కారణాలు చూపుతూ హాజరు కాలేదు. తాజాగా పోలీసులు మ‌రోసారి నోటీసు పంపారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆయ‌న‌కు వాట్సాప్ మెస్సేజ్ ద్వారా దానిని పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై వ‌ర్మ రిప్ల‌య్ ఇస్తూ ఫిబ్రవరి 4న షూటింగ్ కారణంగా హాజరు కాలేనని, 7న విచారణకు వస్తానని తెలిపారు. Ram Gopal Varma పై న‌మోదైన కేసు ఏమిటి? వర్మ తన 'వ్యూహం' సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh)ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట...
ISRO | ఇస్రో 100వ ప్ర‌యోగం స‌క్సెస్‌.. ప్రయోజ‌నాలు ఏమిటంటే..
Technology

ISRO | ఇస్రో 100వ ప్ర‌యోగం స‌క్సెస్‌.. ప్రయోజ‌నాలు ఏమిటంటే..

ISRO New Mission 2025 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బుధవారం తన 100వ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV-F15) రాకెట్ ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్‌ను ఈ మిష‌న్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది. భూభాగం, వాయు, సముద్ర నావిగేషన్, ఖచ్చితమైన వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఉపయోగకరంగా ఈ శాటిలైట్ ఉంటుంది. ఇస్రో కొత్త చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) నేతృత్వంలో జరిగిన మొదటి ప్రయోగం ఇది. ఆయన జనవరి 16న బాధ్యతలు స్వీకరించారు. 2025లో ఇస్రో నిర్వహించిన తొలి ప్రయోగం కూడా ఇదే. GSLV-F15 రాకెట్ దూసుకెళ్లింది ఇలా.. GSLV రాకెట్ బుధవారం ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ISRO విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. 19 నిమిషాల ప్రయాణం తర్వాత, రాకెట్ తన పేలోడ్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లో విజయవంతంగా విడదీసింది...
New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..
State

New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..

New IT parks in Hyderabad : హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో రెండు కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైటెక్ సిటీ మాదిరిగా ఆధునిక మౌలిక సౌక‌ర్యాల‌తో వీటిని స్థాపించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu) వెల్ల‌డించారు. దీనికి ప్ర‌త్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పార్కుల కోసం అనుకూలమైన ప్ర‌దేశాలను ఎంచుకొని అవసరమైన భూముల‌ను కేటాయించేందుకు ప్ర‌క్రియ‌ను ప‌క‌డ్బందీగా చేప‌డుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ముందుకొచ్చిన పెట్టుబ‌డిదారులు కొత్త‌గా ఏర్ప‌డ‌నున్న ఐటీ పార్కుల కోసం న‌గర పరిసర ప్రాంతాల్లో అనుకూలమైన భూముల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు తెలిపారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులకు అనువైన ప్ర‌దేశాల‌నే ఎంచుకుంటామ‌ని చెప్పారు. ఈ మేర‌కు అమెరికాకు చెందిన డ్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీ (‘Dew’ Software Comp...
error: Content is protected !!