Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముందున్న సవాళ్లు ఏంటి?
Rekha Gupta : ఢిల్లీ బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. చారిత్రిక రాంలీల మైదానం (Ramlila Ground) ఈ మహోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఇతర అగ్రనేతలు, ఎన్డీయే ముఖ్యనేతల సమక్షంలో రేఖా గుప్తా (Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేశారు.
ఏన్డీయే ఏకైక సీఎం Rekha Gupta
రేఖా గుప్తా ఢిల్లీలో నాలుగో మహిళా ముఖ్యమంత్రి. ఎన్డీయే కూటమిలో ముఖ్యమంత్రుల బృందం (NDA chief ministers)లో ఆమె ఏకైక సీఎం. 50 ఏళ్ల రేఖా గుప్తా షాలిమార్‌బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పార్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో పాటు మహారాష్ట్ర ముఖ్యమ...




