FASTag New Rules | అమల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధనలు.. పాటించకుంటే నష్టమే..
FASTag New Rules : జాతీయ రహదారులపై టోల్ వసూలు ప్రక్రియను సులభతరం చేయడానికి ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్తగా ఓ రూల్‌ను తీసుకొచ్చింది. ఫాస్టాగ్ (FASTag) బ్లాక్ లిస్టులోకి వెళ్లినప్పుడు వినియోగదారులు రెట్టింపు చార్జలు చెల్లించాలని నిబంధనను విధించింది. ఇది ఈరోజు (2025 ఫిబ్రవరి 17) నుంచి అమల్లోకి వచ్చింది.
FASTag New Rules 2025 : పాటించకుంటే డబుల్ వడ్డింపు
సాధారణంగా తగినంత బ్యాలెన్స్ లేకపోవడం, కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయకపోవడం, లేదా వాహన నంబర్, చాసిస్ నంబర్ వంటి వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. తద్వారా టోల్ ప్లాజాల (Toll Plazas) వద్ద చెల్లింపులు జరగవు. NPCI తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. బ్లాక్ లిస్టులోకి వెళ్లిన వినియోగదారులు 70 నిమిషాల వ్యవధిలో తమ ఫ...




